విధులకు డుమ్మా కొట్టిన వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన - కలెక్టర్ రాజర్షి షా అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
గురువారం ఇంద్రవెల్లి మండలం లోని ప్రాధమిక అరోగ్య కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భం లో మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ తో పాటు CHO సందీప్, PHN జ్యోతి, సూపర్వైజర్ సురేష్ , MLHP పూజ లు ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజర్ అవడం తో షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అదనపు డీఎంఎచ్ ఓ మనోహర్ తో ఫోన్లో మాట్లాడుతూ విధులకు గైర్హాజరైన వారి పై ఆరా తీశారు.
రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్లవేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు .
అంతకుముందు ఆసుపత్రి లోని మెడిసిన్ స్టోర్ రూమ్, ఒపి తో పాటు ప్రసవాల గది,
ప్రాథమిక పరీక్ష గది, ఈసీజీ గదులను , ARU, ASV, TT ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయా లేదా, ఐరెన్ పోలిక్ మాత్రలు పాఠశాలల లో ప్రతి వారం అందించాల్సి ఉంటుందనీ, విద్యార్ధులకు ఇరన్ పొలిక్ మాత్రలు ఇస్తున్నారా లేదా, తదితర వివరాలను డాక్టర్ పూజిత ను అడిగి తెలుసుకున్నారు.
అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేసి రిజిస్టర్ లో సంతకం చేసిన ప్రకారం వైద్యులు, సిబ్బంది ఉన్నారా , లేరా ? పరిశీలించి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారి నరేందర్ ను ఆదేశించారు.
ఆస్పత్రిలో వైద్య సేవల కోసం వచ్చిన రోగులతో ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.
రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా స్టాక్ పూర్తికాక ముందే ఇండెంట్ చేసి మందులను తెప్పించుకోవాలనీ, గర్భిణీ ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు.
అనంతరం టాయిలెట్ ను పరిశీలించగా శుభ్రంగా లేకపోవడం తో అసహనం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పూజిత, రజినీకాంత్, డీఎంఎల్టీ అన్సారి, తదితరులు ఉన్నారు.
Comments