ఎల్.పి.జి గ్యాస్ ఏజేన్సి డీలర్ల తో - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
  అదిలాబాద్ : అక్షరతెలంగాణ :జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం తన ఛాంబర్ లో ఎల్.పి.జి గ్యాస్ ఏజేన్సి డీలర్ల తో
సమావేశం నిర్వహించారు. గ్యాస్ లబ్ది దారుని యొక్క EKYC,  నెట్ వర్క్ లేని గ్రామాలలో క్యాంపు పెట్టి EKYC చేయుట గురించి.
 జిల్లా లో గల సమస్త ఎల్.పి.జి డీలర్లకు ,లబ్ది దారులకు తెలియపర్చవలసిన వివరములు 

-సి.యం పైలెట్ ప్రాజెక్ట్ లో పబ్లిక్ హియరింగ్ జరుగు సమయం లో మీ యొక్క ఏజేన్సీ కి సంభందించిన వారు అందరూ తప్పకుండ హాజరు కావాలి.
-గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయు సమయం లో EKYC చేసుకొమ్మని డెలివరీ బాయ్ లబ్దిదారునికి తెలియచేయాలి.
-గ్యాస్ రాయితీ రాని వారు సంభందిత గ్యాస్ ఏజేన్సీ లో దరఖాస్తు చేసుకొమ్మని లబ్దిదారునికి తెలియచేయాలి.
- నెట్ వర్క్ రాని గ్రామాలలో లబ్ది దారుల కొసం నెట్ వర్క్ వచ్చే పక్క గ్రామం లో క్యాంప్ పెట్టాలి.

  ప్రతి గ్యాస్ ఏజేన్సీ పైన తెలిపిన అంశాలను  తు.ఛ. తప్పకుండ పాటించాలని ఆదేశించారు.
Comments