ఆదిలాబాద్ పట్టణం.లో సోమవారం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ గారి 286వ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ముందుగా బంజారా సాంప్రదాయం ప్రకారం భోగ్ సమర్పించారు. సేవలాల్ జయంతి ఉత్సవాలకు హాజరయిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ని ఉత్సవ సమితి జిల్లా నాయకులు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని లంబాడీ తాండాలలో ఇంటింటికి ప్రచారం చేసిన ధర్మ ప్రచారక్ ఆడే ప్రేమ్ సింగ్ మహరాజ్ గారిని బంజారా ధర్మ గురువు దేవి భక్త శేఖర్ మహరాజ్ మరియు మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మరియు ఖానాపూర్ బీఆర్ఎస్ ఇంచార్జి జాన్సన్ నాయక్ మరియు మాజీ మంత్రి అమర్ సింగ్ తిలవత్ గార్లతో కలిసి సన్మానించారు. అనంతరం గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం వివిధ తేదీల్లో కాకుండా వచ్చే సంవత్సరం నుంచి కచ్చితంగా ఫిబ్రవరి 15వ తేదీనే సేవాలాల్ జయంతి జరుపుకోవాలని సమాజానికి ఎలాంటి సహాయ సాకారాలు కావాలన్న అందిస్తానని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున బంజారా భవన్ నిర్మించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి మహోత్సవంలో ధర్మ ప్రచారక్ ఆడే ప్రేమ్ మహారాజ్ గారిని సన్మానం.
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి మహోత్సవం కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి లంబాడి తండాలో ఇంటింటి ప్రచారం చేసిన సందర్భంగా జయంతి మహాసభలో *సేవాలాల్ ధర్మ ప్రచారక్ ఆడే ప్రేమ్ మహారాజ్ ని బంజారా ధర్మ గురువు దేవి భక్త శేఖర్ మహరాజ్ మరియు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారు, భుక్య జాన్సన్ నాయక్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ మరియు సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు* కలిసి శాలువాలతో సన్మానించి అభినందించారు.కార్యక్రమంలో మాజీ మంత్రులు అమర్సింగ్ తిలవత్ , జోగు రామన్న మరియు ఆయా పార్టీల నాయకులు, బంజారా సేవ సంఘ్ సభ్యులు. తదితరులు పాల్గొన్నారు.
Comments