చికెన్ ప్రియులకు షాక్: చికెన్ విక్రయాలు బంద్.

Madupa Santhosh CEO
అదిలాబాద్ : అక్షరతెలంగాణ :ఆదిలాబాద్ లో హోల్సేల్, రిటైల్ చికెన్ విక్రయాలు బంద్.
 చికెన్ విక్రయాలను  వ్యాపారులు బంద్ చేశారు. బర్డ్ ఫ్లూ భయంతో మార్కెట్ నుబంద్ చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల పాటు చికెన్ మార్కెట్ ను పూర్తిగా బంద్ చేస్తునట్లు వ్యాపారులు ప్రకటించారు.
వారం రోజులుగా వ్యాపారం అంతంత మాత్రమే సాగుతుండడంతో చికెన్ విక్రయదారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. బర్ట్ ఫ్లూ ఎఫెక్ట్ తగ్గింతే వరకు అమ్మకాలను నిలిపివేయాలని తీర్మాణం చేశారు. శుక్రవారం పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. దుకాణాలు తెరిచిన గిరాకులు లేక ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది.
ప్రజల్లో ఉన్న భయం తొలిగే వరకు అమ్మకాలను చేపట్టబోమని పేర్కొన్నారు.స్వచ్ఛధంగా మూసేస్తున్నాంఈ సందర్భంగా పలువురు వ్యాపారులుమాట్లాడుతూ..
 జిల్లాలో బర్ట్ ఫ్లూ ఎఫెక్ట్ లేదని, ఎలాంటి భయం లేకుండా చికెన్ తినొచ్చని వ్యాపారులు అంటున్నారు. ఏదైనా వైరస్ ఉంటే మొదట తమపై ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి వైరస్ ప్రభావం రాలేదన్నారు.ప్రజల్లో ఉన్న భయం పోయేంత వరకు అమ్మకాలను స్వచ్చందంగా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. చికెన్ విక్రయాలను నిలిపివేయాలని అధికార ప్రకటన రాలేదని తెలిపారు.
 అయితే ఇతర జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. గిరాకీలు కూడా కావడం లేదన్నారు. వైరస్ ప్రభవం
ఆదిలాబాద్ లో ప్రతి ఆదివారం రూ. 60 లక్షల నుంచి రూ.70 లక్షల చికెన్అమ్మకాలు జరిగేవని, ఇప్పుడు 20 శాతం కూడా గిరాకీ కాలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మటన్ కు  గిరాకీ పెరగడంతో కిలో ధర రూ.800 నుంచి రూ.900కి పెంచేశారు. ఆదిలాబాద్ లోనూ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చాలానే కనిపిస్తున్నది. పక్కనున్న మహారాష్ట్రలోని నాగ్పూర్, చంద్రపూర్లో బర్డ్ ఫ్లూ బయటపడడంతో.. జిల్లాలోని జనం చికెన్ తినేందుకు భయపడుతున్నారు.
చికెన్ షాపులే కాదు.. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా చికెన్ ఐటమ్స్ ఆర్డర్లు తగ్గిపోయాయి. సాధారణ రోజుల్లో ఆర్డర్లలో 70 శాతం చికెన్ అమ్మకాలు తగ్గాయి.బర్డ్ ఫ్లూ ప్రభావంతో జిల్లాలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. జిల్లాలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ వైరస్ ఆనవాళ్లు లేకున్నా ఇతర జిల్లాలో వైరస్ వ్యాప్తి కారణంగా చికెన్ తినేందుకు ప్రజలు జంకుతున్నారు.ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకు తాము కూడా విక్రయాలను చేయబోమని స్పష్టం చేశారు. వైరస్ పై రాష్ట్ర వ్యాప్తంగా భయందోళన పరిస్థితులు నేలకొన్నయని తెలిపారు. గురువారం నుంచి వారం రోజుల పాటు అంటే మార్చి 1వ తేది వరకు తమ దుకాణాల మూసి వేత.
Comments