పీఎం శ్రీ కార్యక్రమం లో భాగంగా విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్

Madupa Santhosh CEO
క్షేత్ర పర్యటనలు (ఫీల్డ్ ట్రిప్స్) ప్లాన్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్అదిలాబాద్ : అక్షరతెలంగాణ : 
పీఎం శ్రీ కార్యక్రమం లో భాగంగా విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ఉజ్వల భారతదేశం కోసం ప్రధానమంత్రి పాఠశాలలు (పీఎం శ్రీ)* కార్యక్రమం లో భాగం గా అధికారులు విద్యార్థుల కోసం  క్షేత్ర పర్యటనలు (ఫీల్డ్ ట్రిప్స్) ప్లాన్ చేసారు.. 
దీనిలో భాగంగా బుధవారం *గుడిహత్నూర్ లోని ప్రభుత్వ మోడల్ స్కూల్ మరియు ఉన్నత పాఠశాల, యాపాల్ గూడ* విద్యార్థులు ఉట్నూర్ లోని ఐటిడిఏ ఉద్యాన నర్సరీని సందర్శించారు.
ప్రాజెక్టు ఉద్యాన అధికారి గుడిమల్ల సందీప్ కుమార్ వివిధ రకాల పంటలపై అవగాహన కల్పించారు 
మనం తినే ఆహారాన్ని, రైతులను గౌరవించాలని, రైతులు ఆరుగాలం కష్టపడితేనే మనకు ఆహారం లభిస్తుందని, రైతుల గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలని* ఈ సందర్భంగా కోరారు.

విద్యార్థులు అడిగే పలు ప్రశ్నలకు సందీప్ కుమార్ సమాధానాలు ఇచ్చారు. రోజువారి ఆహారంలో పండ్లు కూరగాయల పాత్ర చాలా ప్రాముఖ్యమైనదని ఆరోగ్య సంరక్షణలో పండ్లు, కూరగాయలు ఆకుకూరలు ఎంత గానో ఉపయోగపడతాయని తెలిపారు. 
మామిడి, జామ, నిమ్మ, మునగ, సపోటా తోటల్లో తిరుగుతూ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మోడల్ కాలేజీ గుడిహత్నూర్ ప్రిన్సిపల్,   యపాల్ గూడ హై స్కూల్ హెడ్మాస్టర్, టీచర్లు, 500 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments