పరమ శివుడి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలి - ఎమ్మెల్యే. పాయల్ శంకర్: అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జైనథ్ మండలం స్వగ్రామం " ఆడ " శివాలయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబ సమేతంగా బుదవారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటి సభ్యులు, నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి పరమ శివుడిని కొలిచారు. అంతకుముందు గ్రామంలో నిర్వహించిన పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.... పరమ శివుడి కృపా కటక్షలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని అన్నారు. ప్రజలందరికి మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
Comments