- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బార్ అససియేషన్, సెంట్రల్ లైబ్రరీ లో ప్రచారం.
- విలేకరుల సమావేశం లో మాట్లాడిన ఎమ్మెల్సీ అభ్యర్థి ,
ఆదిలాబాద్ : అక్షరతెలంగాణ :
- అనగారిన వర్గాల బిడ్డగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ ఉమ్మడి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, వెనుక బడిన జాతుల ఉన్నతి కోసం ఉద్యమిస్తున్న నని పట్ట భద్రులు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ధర్మ సమాజ్ పార్టీ పట్టభద్రుల ఎం.ఎల్.సి అభ్యర్థి మంద జ్యోతి అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో వేల కొట్లున్న అగ్రవర్ణాలు పోటీ చేస్తున్నాయని, కాంగ్రెస్ బిజెపి లాంటి పార్టీలు వేల కోట్లు ఉన్నటువంటి నాయకులకు ప్రాధాన్యత కల్పించాలని, వారి వల్ల సమాజానికి మేలు జరగదు అన్నారు. ప్రజాస్వామికంగా పీడిత బాధ్యత వర్గాలకు న్యాయం జరగాలంటే అనగారిన వర్గాల ప్రాతినిథ్యం కావాలని పేర్కొన్నారు. వైద్య వృత్తిలో ఎంతో సేవలందించిన, పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ పోరాటం చేస్తున్న నాకు మరింతగా మద్దతుగా నిలిచి గెలిపించాల్సిందిగా వేడుకున్నారు. విద్య వైద్యం నాణ్యతలేమిటో ప్రజలు మరింత పేదరికం బారిన పడుతున్నారని, అగ్రకులాలకు ఓటు అమ్ముడు పోకుండా ఓటు చైతన్యంతో పడ్డబద్రులు విద్యావంతులు మేధావులు ఆలోచించి ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో సీరియల్ నెంబర్ 9 న మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు, మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ కాన్షిరాముల ఆలోచనలతో జరుగుతున్న ఉద్యమానికి మీ ఓటు ద్వారా మద్దతు పలకాలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదలు చైతన్యవంతంగా ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్రాల నగేష్ ను , బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి కోర్టును అభ్యర్థించారు. అనంతరం జిల్లా కేంద్ర లైబ్రరీలో విద్యావంతులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంబేద్కర్ సంఘాల జేఏసీ నాయకులు పుష్ప కు వచ్చాయి ఇచ్చి అభినందనలు తెలిపారు.. ఇందులో రాష్ట్ర కార్యదర్శి అన్నేల లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్, జిల్లా నాయకులు అన్నెల ఆడేల్లు, దర్శనాల సుష్మ, గోపి, బోథ్ మండల అధ్యక్షుడు కొండమడుగు గణేష్, తలమడుగు మండల అధ్యక్షుడు అగ్గిమల్ల నవీన్, ఇచ్చోడ మండల నాయకుడు లక్ష్మణ్, జైనథ్ మండల నాయకుడు గొంటిముక్కుల ఒమన్న, ఆదిలాబాద్ అర్బన్ నాయకుడు తొంటి కోరి సంతోష్, అదిలాబాద్ రూరల్ మండలం నాయకులు విట్టల్, వివిధ మండలాల నాయకులు వినోద్, రాంచందర్,సాయి కుమార్,వినుకుమార్,వినోద్ తదితరులు అన్నారు.
Comments