అదిలాబాద్ : అక్షరతెలంగాణ :జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో జిల్లా పాలనాధికారి రాజర్షి షా గురువారం త్రాగునీరు, రైతుభరోసా, రేషన్ కార్డులు, పైలెట్ ప్రజావాణి, ఎల్ ఆర్ ఎస్, పవర్ స్విచ్ వేషన్, ఇందిరమ్మ ఇళ్లు , ఈ ఈ పి సి సర్వే ఆఫ్ లెఫ్ట్ ఓవర్ హౌస్ హోల్డర్ 8 అంశాల పై సమీక్షించారు.
రేషన్ కార్డులు: ప్రజా పాలనలో గానీ, గ్రామ సభల లో గాని రేషన్ కార్డు కోరకు దరఖాస్తు చేసుకున్నట్లైతే వారు మరలా మీసేవ యందు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరము లేదని, ఒక వేల ప్రజాపాలన లో గానీ, గ్రామ సభల లో గాని రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయని యెడల కొత్త రేషన్ కార్డ్ / కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుట కోరకు మీసేవ యందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
త్రాగునీరు : వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలని rws అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా ఎక్కడెక్కడ మరమత్తులు అవసరం ఉన్నాయో గుర్తించాలన్నారు.
ఏ హ్యాబిటెశన్ లో నీటిని ట్యాంకర్ల తో సరఫరా చేస్తున్నారో ఆ వివరాలు కూడా నివేదిక రూపం లో ఇవ్వాలన్నారు. అలాగే త్రాగునీటి సమస్యల పై ప్రత్యామ్నాయ మార్గాల ను ఏర్పాటు,
ప్రతీ నెల ఒకటవ తేదీ నుండి 21వ తేది వరకు మున్సిపల్, గ్రామ పంచాయితీ లలో ట్యాంకర్ల లో క్లీనింగ్, ఫ్లషింగ్, బ్లీచింగ్ పౌడర్ క్లోరినేషన్ వేయాలని సూచించారు. ప్రతీ హ్యాబిటెశన్ లో పకడ్బందీగా నిర్వహించాలి, లేనిచో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు .
క్రిటికల్ హ్యాభిటేశన్ వివరాలు నివేదిక రూపం లో ఈ నెల 24 వ తేదీ లోగా సమర్పించాలని, శాశ్వత పరిష్కారానికి సంబందించిన వివరాలు సమర్పించాలని ఆన్నారు.
అలాగే యూరియా సమస్య ఎక్కడైనా ఉందా అని అడిగి తెలుసుకొని , యూరియా ఎంత ఉంది ఇండెంట్ జీరో కాకముందే అడ్వాన్స్ గా జాగ్రత్తలు పాటించాలని, ఎక్కడ కూడా యూరియా సమస్యలు తలెత్తితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
పైలెట్ ప్రజావాణి: అన్ని ఎంపిడిఓ కార్యాలయంలో ఫెసిలిటీస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజూ దరఖాస్తులను స్వీకరించాలని, అర్జిదారులు కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు సమర్పించే సమయం లో సిబ్బంది అర్జిదారులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.
పైలెట్ ప్రజావాణి ప్రజల్లో . అవగాహన కలిగేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా అవగాహన కల్పించాలి. రానున్న 5 నెలల వరకు పైలెట్ ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, గ్రీవెన్స్ రెడ్రెసల్ ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అర్జీదారుల నుండి తీసుకున్న దరఖాస్తులను పబ్లిక్ హియరింగ్ కంటే ముందే అర్జిదారునితో సమస్య పై ఆరా తీయాలని, అలాగే యాక్షన్ టెక్ రిపోర్ట్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలనీ, వచ్చే పబ్లిక్ హియరింగ్ వారం లో 4 మండలాల్లో ఏర్పాటు చేయాలని, లాజిస్టిక్ ఆరెంజ్ మెంట్స్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించాలని, విజయవంతంగా కొనసాగడానికి ఆన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు : ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించి మోడల్ హౌస్ ఇళ్లు 17 గ్రామాల్లో ప్రారంభించారా, ఎప్పటి వరకు నిర్మాణ పనుల పురోగతిని అని ఇంజనీరింగ్ వింగ్ ను అడిగి తెలుసుకొని, మోడల్ ఇళ్లు, మొదటి పేస్ లో ఎంపికైన ఇందిరమ్మ ఇళ్లు మార్చ్ 10 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు.
17 మండలాల లబ్దిదారులతో సంబంధిత అధికారులు సమావేశాలు నిర్వహించాలని,
ఇంకా ప్రారంభం కానీ చోట వెంటనే ప్రారంభించాలని పేర్కొన్నారు.17 మండలాల్లో 15 మండలాలు నిర్మాణాలు చేపట్టి పనులు ప్రారంభించడం జరిగిందనీ, రెండు మండలాలు త్వరలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
-పవర్ స్విచ్ వేశన్ : కరెంట్ సరఫరా లో ఎలాంటి కంప్లైంట్, సమస్యలు రాకుండా చూడాలని ఎక్కడ కూడా పవర్ కటింగ్ ఉండవద్దని తెలిపారు.
AE, DE లకు ఇంట్రక్షన్స్ ఇవ్వాలని ఆన్నారు.
హెల్త్, మిషన్ భగీరథ లో ఎలాంటి పవర్ కటింగ్ లేకుండా చర్యలు చేపట్టాలి.
వేసవిలో విద్యుత్ లో అసౌకర్యం కలగకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు
ప్రజాపాలన సేవకేంద్రం లో కులగణన సర్వే లో వివరాలు ఇవ్వని వారు ఉంటే వారి వివరాలు తీసుకునే ముందు గతం లో సర్వే చేసిన వివరాలు ఎంట్రీ అయింది లేనిది చూడాలని, ఫామ్స్ ఆన్ని మీ సేవా కేంద్రం లో అందుబాటులో ఉంచాలన్నారు.
LRS, రైతు భరోసా,తదితర వాటిపై సమీక్షించిన
అనంతరం ప్రతీ పాఠశాలలో యూనిఫాం అందించుటకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని యూనిఫాం స్టిచింగ్ కొరకు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుందని, మ్యాచింగ్, మ్యాచింగ్ గ్రూప్ చేసి ప్రతీ స్కూల్ కి వెళ్లి విద్యార్ధుల మెజర్మెంట్ వారం లోగా తీసుకోవాలని , మార్చి మొదటి వారం లో క్లాత్ వస్తుందని , అంతకుముందు మెజార్మెంట్, కుట్టు మిషన్ ల పనితీరు, తదితర రెడీ చేసుకోవాలనీ ఆన్నారు.
APM లకు పలు సూచనలు సలహాలు చేశారు.
గూగుల్ మీట్ లో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్ డి వో వినోద్ కుమార్, జడ్పీ సీఈవో జితేందర్, 2bh k భశవేశ్వర్ రావు, సంబంధిత జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, ఎం పి వో, తదితరులు పాల్గొన్నారు.
Comments