ప్రతి మహిళ. డబ్బుల ను పొదుపు చేసి ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలి.

Madupa Santhosh CEO
  ప్రతి మహిళ. డబ్బుల ను పొదుపు చేసి ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలి.అదిలాబాద్ : అక్షర తెలంగాణ: నేటి సమాజంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని,అందుకు తప్పనిసరిగా,బాధ్యతగా డబ్బును పొదుపు చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.ఆర్బీఐ వారి వారోత్సవాల్లో భాగంగా ఆర్థిక క్రమశిక్షణ వారోత్సవాలను నిర్వస్తున్నారు.  సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారోత్సవాల పోస్టర్లను సంబందిత  అధికారులతో కలిసి విడుదల చేశారు.ఈ వారోత్సవాలు ఫిబ్రవరి  తేది 24 నుంచి 28 వరకు మహిళలకు ఆర్థిక అక్షరాస్యత,మహిళా శ్రేయస్సు కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ప్రథమ బాధ్యతగా గుర్తించాలని కోరారు.  ఈ. కార్య్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్ కుమార్ దాస్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పద్మ భూషణ్ రాజు, టిజిబి రీజినల్ మేనేజర్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments