అదిలాబాద్ : అక్షరతెలంగాణ : వేసవిలో త్రాగునీరు, విద్యుత్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి :
సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమీషనర్ కృష్ణ ఆదిత్య.
వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు నీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలని,
రానున్న వేసవిలో జిల్లాలోని ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కమీషనర్ కృష్ణ ఆదిత్య ఆన్నారు.
ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు, కరెంట్ కోతల కు సంబంధించి గతంలోని అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని అవాసలలో అన్ని చర్యలూ తీసుకోవాలని అన్నారు. బోరు బావుల ఫ్లషింగ్, ఇతర నిర్వహణ పనులు ముందుగానే చేపట్టాలన్నారు.
వేసవి ప్రభావం ఇప్పటి నుండే ప్రారంభమైందని, మే, జూన్‌లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వంటి అంశాలు కారణంగా నీటి ఎద్దడి ఎక్కువ ఉండే అవకాశం ఉందని, కావున పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
అలాగే మున్సిపల్ ప్రాంతాల్లో తాగునీటి సమస్య , కరెంట్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడాలని చెప్పారు.
Comments