ఇటీవల కాలంలో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య కొలెస్ట్రాల్. చాలా మంది కొలెస్ట్రాల్ ఏం చేస్తుందని లైట్ తీసుకుంటున్నారు. కానీ అదే వారి ప్రాణాల మీదికి వచ్చి> కూర్చుంటుందని తెలీదు. కొలెస్ట్రాల్ ఉన్నట్లు చర్మంపై కనిపించే లక్షణాలు ఏంటో చూసేద్దాం.
1. ఇటీవల కాలంలో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య కొలెస్ట్రాల్. చాలా మంది కొలెస్ట్రాల్ ఏం చేస్తుందని లైట్ గా తీసుకుంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకోవడం వంటివి అధిక కొలెస్ట్రాల్ సమస్యకు ప్రధాన కారణాలు
2. ఇది మధుమేహం, గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది. అయితే, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో కొన్ని చర్మ లక్షణాలు, కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చని సూచిస్తున్నారు.
3. కాళ్లపై చర్మ రంగు మారడం
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో కాళ్ల దిగువ భాగంలో చర్మం రంగు మారుతుంది. ఇది పాలిపోయినట్లు, మెరుస్తూ కనిపించవచ్చు లేదా ఎరుపు రంగులో మచ్చల్లా ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల జరుగుతుంది.
4. చర్మంపై చిన్న చిన్న బొడిపెలుచర్మంపై పసుపు లేదా నారింజ రంగులో చిన్న చిన్న గడ్డలు కనిపించడం అధిక కొలెస్ట్రాల్ లక్షణంగా భావించబడుతుంది) ఇవి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, చేతులు, మెడపై కనిపిస్తాయి.
5. కంటి రెప్పల దగ్గర పసుపు రంగు చారలు
కంటి రెప్పల చుట్టూ, కళ్ల దిగువ భాగాల్లో లేత పసుపు రంగులో చారలు ఏర్పడడం అధిక కొలెస్ట్రాల్ సూచికగా భావించబడుతుంది. దీనిని వైద్య భాషలో 'జ్సాంతెలెస్మా' అంటారు.
6. కంటి రెప్పల దగ్గర పసుపు రంగు చారలు
కంటి రెప్పల చుట్టూ, కళ్ల దిగువ భాగాల్లో లేత పసుపు రంగులో చారలు ఏర్పడడం అధిక కొలెస్ట్రాల్ సూచికగా భావించబడుతుంది. దీనిని వైద్య భాషలో 'జ్సాంతెలెస్మా' అంటారు.
7. కనుపాప రంగు మారడం
కంటి పాప చుట్టూ తెలుపు, బూడిద లేదా లేత నీలం రంగులో వలయాలు ఏర్పడితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు భావించాలి. ముఖ్యంగా యువతలో ఈ లక్షణం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.
8. గాయాలు మానటానికి ఎక్కువ సమయం పడటంఅధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తుల శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది. దీనివల్ల చిన్న చిన్న గాయాలు కూడా మానటానికి ఎక్కువ సమయం పడుతుంది.
9. చర్మంపై నలుపు రంగు ప్యాచ్లు
మెడ, బాహుమూలాలు, జననాంగాల చుట్టు పక్కల నలుపు రంగు మచ్చలు కనిపించడం అధిక కొలెస్ట్రాల్ లక్షణంగా భావించబడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారిలో కూడా సాధారణంగా కనిపించవచ్చు.
10. ఈ లక్షణాలు ఉంటే, వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ నియంత్రణ ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ లక్షణాలు ఉంటే, వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ నియంత్రణ ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Comments