క్రీడలతో యువతకు మానసిక ఉల్లాసం లభిస్తుంది.సామ రూపేష్ రెడ్డి.

Madupa Santhosh CEO
క్రీడలతో యువతకు మానసికొల్లాసం లభిస్తుంది.సామ రూపేష్ రెడ్డి.గ్రామీణ ప్రాంతాలలో ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని,వారి క్రీడల్లో రాణించి గ్రామాలకు,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు.
 అదిలాబాద్: అక్షరతెలంగాణ: బేల మండలం దైగావ్ గ్రామం లో బేల ఎస్సై దివ్యభారతి* మరియు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సోమవారం క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడ కారులను పరిచయం చేసుకొని వారు మాట్లాడారు.ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారని అన్నారు.వారిని గుర్తించి ప్రోత్సహించేవారు లేకపోవడంతో బయటకు రాలేకపోతున్నారని తెలిపారు.అలాంటి వారిని గుర్తించి క్రీడల్లో ప్రోత్సహించేందుకే ఈ గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు.వీటిని సద్వినియోగం చేసుకొని క్రీడాకారులు గ్రామంతో పాటు మండలం,జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రాందాస్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్,మాజీ మార్కెట్ మండల అధ్యక్షుడు ఉల్కే,మాజీ సర్పంచ్ గ్రూప్ రావు జైనథ్ మార్కెట్ కమిటీ మెంబర్ మడవి చంద్రకాంత్,శంకర్,ఎండి అఖిల్,విపిన్,మున్నా,సాగర్,హేమంత్,పాండురంగ్,గులాబ్,బోయర్ ప్రమోద్,కన్య రాజు,స్వప్నిల్,తదితరులు ఉన్నారు.
Comments