జగిత్యాల: అక్షర తెలంగాణ:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని గోపులాపూర్ గ్రామంలో మార్చి 17 న సోమవారం విశ్వకర్మ ముద్దుబిడ్డ తోరేటి విష్ణువర్ధన్ అదే గ్రామానికి చెందిన కండ్లే మదన్ కుమార్ ఇంటికి వడ్రంగి పని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆ పని నీ పూర్తి చేశాడు. సదరు వ్యక్తి ఇంకొక పని ఉన్నదని దానిని నీవే చేయాలని ఇబ్బంది పెట్టగా తనకు ఇప్పుడు పని ఉన్నదని, ఇప్పుడు చేయలేను అని వడ్రంగి చెప్పాడు. కండ్లే మదన్ (ఎస్సీ మాల వృత్తి అడ్వకేట్) విష్ణును విపరీతంగా కులాన్ని దూషిస్తూ విశ్వకర్మ లను కించపరిచే విధంగా, కుటుంబాన్ని దుర్భాషలాడుతూ విష్ణుపై అనుచిత వ్యాఖ్యలు చేసి చెయ్యి చేసుకున్నాడు. తదనంతరం బుగ్గారం మండలం అధ్యక్షుడు ఏలేశ్వరం సత్తయ్య, ఉపాధ్యక్షులు వనతడుపుల చారి, గోపులాపుర్ గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మండల కుల బాంధవులు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జిల్లా సంఘం అధ్యక్షులు చింతల రాజేశ్వర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో కండ్లే మదన్పై ఫిర్యాదు చేశారు. శుక్రవారం నిందితుడిని పట్టుకొని ఎస్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ కు పంపించారు. విశ్వకర్మలకు న్యాయం చేసిన బుగ్గారం ఎస్సె శశిధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చింతల రాజేశ్వర్, బుగ్గారం మండలం అధ్యక్షులు ఏలేశ్వరం సత్తయ్య, గొల్లపల్లి మండల్ అధ్యక్షులు బలబత్తుల కిషన్, ఉపా ధ్యక్షులు ప్రధాన అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు ఉన్నారు.
Comments