రౌడీయిజానికి పాల్పడుతున్న వ్యక్తిపై పిడి యాక్ట్ నమోదు - డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.

Madupa Santhosh CEO
ADB: రౌడీయిజానికి పాల్పడుతున్న వ్యక్తిపై పిడి యాక్ట్ నమోదు  - డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ : 
 నిందితుడు షేక్ సలీం @  కైంచి సలీం (బంగారిగూడ) అరెస్టు, చంచలగూడ జైలుకు తరలింపు.

 షేక్ సలీం @ కైంచి సలీం పై హత్య, రౌడీయిజం, కిడ్నాప్, బెదిరింపుల కేసులలో ప్రధాన నిందితుడు.

 ఆదిలాబాద్ వన్ టౌన్, రూరల్, మావల పోలీస్ స్టేషన్లో ఇతనిపై 8 కేసులు నమోదు.

 పదేపదే వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఏర్పాటు, పిడి యాక్ట్ నమోదు.

 గంజాయి తరలిస్తూ, వ్యాపారం చేస్తూ ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

రౌడీయిజం చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ, మారనాయుధాలతో పబ్లిక్ స్థలాలలో విన్యాసాలు చేస్తూ, తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న *షేక్ సలీం (30) @ కైంచి సలీం* పై *పిడి యాక్ట్* నమోదు చేసి అరెస్టు చేసి చంచల్ గూడా జైలుకు తరలించడం జరిగిందని ఆదిలాబాద్ *డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి* తెలియ చేశారు. నిందితునిపై ఇదివరకే ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో పోలీస్ స్టేషన్లో 8 కేసులలో ప్రధాన నిందితుడుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో హత్య కేసు, రూరల్ పోలీస్ స్టేషన్ నందు(6 కేసులు) మారణాయుధాలతో విన్యాసాలు చేస్తు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్న కేసు, ఆటో డ్రైవర్ ని కిడ్నాప్ చేసి రూమ్ లో బందించి బాధితుని బట్టలు విప్పదీసి, మూకుమ్మడిగా దాడి చేసి  వీడియోలు తీసి విచక్షణారహితంగా కొట్టిన సందర్భంలో పలు కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వేధించిన సందర్భాలలో ఇతనిపై కేసు నమోదు అవ్వడం జరిగిందన్నారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తప్పు చేసిన వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలతో  పీడీ యాక్ట్ సైతం నమోదు చేయడానికి వెనకాడ బోధని తెలిపారు. అదేవిధంగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై, రౌడీయిజం చేసే వారిపై గంజాయి స్మగ్లర్లు, అమ్మేవారిపై తగు చర్యలను తీసుకుంటుందని తెలిపారు. నిందితుడు షేక్ సలీం @ కైంచి సలీం 2019 సంవత్సరంలో హత్య కేసు 2025 సంవత్సరం రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఆమ్స్ యాక్ట్ కేసులు, రౌడీయిజం కేసు నమోదు అయినాయని తెలిపారు. ప్రవర్తన మార్చుకొని రౌడీలు, వ్యవస్థీకృత నేరాలు చేసే వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసి పరిశీలించడం జరుగుతుందని అదేవిధంగా నేరాలకు పాల్పడుతున్న వారిపై పిడి యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ అరెస్టు లో ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిదర్,రూరల్ ఎస్ఐ విష్ణు వర్ధన్ పాల్గొన్నారు.

 ఆదిలాబాద్ : ప్రతినిధి: 

 పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల నిజద్రువపత్రాలను సమర్పించాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
 51 వాహన యజమానులు తిరిగి తీసుకువెళ్లడానికి అవకాశం.

 వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల ధ్రువపత్రాలను సమర్పించుటకు ఆరు నెలల గడువు ప్రారంభం.
 వాహనాల యజమానులు ఆరు నెలల్లోగా ధ్రువపత్రాలు చూపించి తిరిగి పొందడానికి అవకాశం.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ కార్యాలయాలలో వివిధ నేరాలకు సంబంధించినవి మరియు దొరికిన వాహనాలు కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాలు 51 వాహనాలు యజమానులు తిరిగి తీసుకెళ్లడానికి ఆరు నెలల అవకాశం కల్పిస్తూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలందరూ గమనించాలని జిల్లాలోని 21 పోలీస్ స్టేషన్లో పరిధిలో పోలీసుల ఆధీనంలో ఉన్న వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్నవి గుర్తుతెలియని వ్యక్తుల వదిలి వెళ్ళినవి కొన్ని నెలలుగా పోలీస్ స్టేషన్లో పేరుకుపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 51 వాహనాలను గుర్తించడం జరిగిందని, ఆ వాహనాలను సరైన ధ్రువపత్రాలను సమర్పించడానికి ఆరు నెలలు అనగా 2026 సంవత్సరం జనవరి వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని యజమానులు పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు సరైన ధ్రువపత్రాలు సమర్పించి వాహనాలను తీసుకువెళ్లవచ్చని తెలిపారు. వాహనాల వివరాలు అనగా వాహన నంబర్లు ఇంజన్ నెంబర్లు తెలుసుకోవడానికి జిల్లా పోలీస్ అధికారిక సోషల్ మీడియా SPAdilabad పేరుతో ఉన్న facebook, Instagram  ఖాతాలలో పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఆరోనెల గడవు అనంతరం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మిగిలిన వాహనాలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు. ఎలాంటి సందేహాల కైనా రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి మురళి 8712659962 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

ఆదిలాబాద్ : ప్రతినిధి: 
 ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.: 
 సమిష్టి కృషితోనే బాల కార్మికుల వ్యవస్థ జిల్లాలో పూర్తిగా నాశనం.
 బాలలు బడులకి అంకితం కావాలని జిల్లా పోలీసుల పిలుపుతో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం

 జిల్లా లో 93 మంది బాల కార్మికులకు విముక్తి.
 జిల్లావ్యాప్తంగా 28 కేసుల నమోదు
 86 బాలురు,7 బాలికలను రక్షించిన యంత్రాంగం.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ ముస్కాన్ పేరుతో నెలరోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 93 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు మరియు వసతి గృహాలకు చేర్చి బాల కార్మికుల వ్యవస్థను నాశనం చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ ను విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ నందు జిల్లావ్యాప్తంగా 93 మంది పిల్లలను రక్షించినట్టు అందులో 70 మంది పిల్లలను తల్లిదండ్రులకు 23 మంది పిల్లలను వసతి గృహాలకు తరలించి సొంత వారికి అప్పగించినట్లు తెలిపారు. 93 మంది పిల్లలలో 86 మంది బాలురు ఏడుగురు బాలికలు ఉన్నట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 28 కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారు ఇందులో 26 మంది ఉన్నట్లు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా జిల్లా వెల్ఫేర్ కమిటీ కార్మిక శాఖ, విద్యాశాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, వైద్య శాఖ, మరియు ఎన్జీవోల సహకారంతో జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ను విజయవంతం చేసి బాల కార్మికులను గుర్తించి తగు చర్యలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రెస్క్యూ చేసిన వారిలో హోటల్లలో, భవన నిర్మాణాలలో, ఇటుక బటీలలో పనులలో ఉన్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అందజేసి అవగాహన కల్పించడం జరిగిందని బాలలను బడులకు పంపాలని తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల వారికి విడతలవారీగా వారి సొంత స్థలాలకు చేర్చి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. చట్ట ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల రోజులపాటు కొనసాగిన ఈ ఆపరేషన్ ముస్కాన్ తో ఆగకుండా సంవత్సరం పాటుగా బాల కార్మికులు కనబడినట్లయితే వెంటనే డయల్ 100 ద్వారా తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
Comments