బీ సి సంఘం తరఫున రేవంత్ రెడ్డి కి కృతజ్ఞత సభ

Madupa Santhosh CEO
అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించినందున జన్నారంలో బీసీ సంఘంచే కృతజ్ఞత సభ, సంబరాలు మంచిర్యాల : అక్షరతెలంగాణ :
గత దశాబ్దాల కాలంగా విద్య ఉద్యోగాల్లో చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో బీసీ సంఘాలు చేస్తున్న పోరాటాలు ఫలించి మొన్న 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన నందున జన్నారం బీ సి సంఘం తరఫున రేవంత్ రెడ్డి కి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య గారు మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభలో బీసీ బిల్లు ఆమోదించినందుకు  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి మరియు మంత్రివర్గ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇతర బిజెపి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏం ఐ ఎం, సిపిఐ పార్టీల శాసనసభ్యులకు నాయకులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు
  రేవంత్ రెడ్డి  బీసీ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ రిజర్వేషన్లు సాధించటానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి కూడా లేఖ రాసి బిసి బిల్లు గురించి మిమ్ములను కలిసి వినతి పత్రం అందజేయడానికి మాకు అవకాశం కల్పించవలసిందిగా కోరుతూ లేఖ రాసినందుకు రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.
   బస్టాండ్ సమీపంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
   ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం కరీంనగర్ జోన్ కన్వీనర్ కె ఏ నర్సింలు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కడార్ల నరసయ్య  మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ  మాజీ సర్పంచ్ బూసనవేణి గంగాధర్ గౌడ్  జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్  మాజీ ఎంపిటిసి రాగుల శంకర్  జన్నారం మండలం గౌడ సంఘం అధ్యక్షుడు మూల భాస్కర్ గౌడ్  ముదిరాజ్ సంఘం జన్నారం మండల ఉపాధ్యక్షుడు ఐలవేణి రవి   ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆండ్ర పురుషోత్తం  దొనోజు శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా బీసీ సంఘం కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్  నాయి బ్రాహ్మణ సంఘం జన్నారం మండల మాజీ అధ్యక్ష కార్యదర్శులు కస్తులాపురి నాగేందర్  గొల్లపల్లి రమణ  దర్జీ మేరు సంఘం అధ్యక్షుడు రాపర్తి వెంకటేష్  సంతోష్  టూ వీలర్స్ మోటార్ సైకిల్ మెకానిక్స్ సంఘం అధ్యక్షుడు బాలిన మధు. బావండ్లపెళ్లి శ్రీనివాస్, జక్కుల సత్తయ్య యాదవ్  మ్యాకల కిరణ్ .తదితరులు పాల్గొన్నారు.
Comments