ఇళ్లను అద్దెకు ఇచ్చే ఓనర్లు..... జాగ్రత్త

Madupa Santhosh CEO

ఇళ్లను  అద్దెకిచ్చే ఓనర్లు .,...జాగ్రత్త.  డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి.
అదిలాబాద్ : అక్షర తెలంగాణ : 
 - మట్కా గేమింగ్, పేకాట ఆడితే ఇల్లు జప్తు అవుతుంది.
- అసాంఘిక,చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నిర్వహిస్తే ఇల్లు, భవనాల జప్తు.
 - ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో నలుగురు మట్కా జూదరుల పై కేసు
- రూ 10200/- నగదు, పెద్ద ఎత్తున మట్కా చీటీలు స్వాధీనం.
ఇంట్లో మట్కా నిర్వహించిన, జూదం, పేకాట ఆడిన ఇల్లు సీజ్ అవుతుందని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఇల్లు కానీ, షాపు గాని, గోడౌన్ గాని, షెడ్లు గాని కిరాయికి తీసుకొని లేదా సొంతగా ఓనర్లే ఆసాంఘిక కార్యకలాపాలైన మట్కా, జూదం పేకాట లాంటివి నిర్వహిస్తే ఇకనుండి సెక్షన్ 152 బి ఎన్ ఎస్ ఎస్ ప్రకారం ఆర్డిఓ కి సిఫార్సు చేసి ఇల్లుని భవనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని ఆదిలాబాద్ డిఎస్పి తెలిపారు. వివరాలలో ఈరోజు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో రనదివ్య నగర్ కు సంబంధించిన వ్యక్తి జుంగిరే ప్రవీణ్, లఖన్, పుస్తక్ శివ, చందన్ కేడి ఆకాష్ లపై మట్కా కేసు నమోదు అయిందని వారి వద్ద నుండి రూ 10200/-, పెద్ద ఎత్తున మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఓనర్లు ముందు జాగ్రత్తగా కిరాయికి ఇచ్చేముందు కిరాయి దారులు ఏం చేస్తున్నారని విషయాన్ని గమనించాలని తెలిపారు. ఒకవేళ కిరాయి దారులు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే దానికి తమ ఇల్లును రెవిన్యూ అధికారులు జప్తు అవుతుందని గమనించాలన్నారు. ఓనర్లే నిర్వహిస్తే వారిపై కేసు నమోదు చేస్తూ ఇల్లు జప్తు చేసుకోబడుతుందని తెలిపారు. గతంలో మావాల పోలీస్ స్టేషన్ల పరిధిలో నకిలీ విత్తనాల నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న సమయంలో నిర్వహిస్తున్న స్థలం షెడ్డును సెక్షన్ 152 బిఎన్ఎస్ఎస్ ప్రకారం జప్తు చేసుకోవడం తెలిపారు. రెండు రోజుల క్రితం కుర్షిత్ నగర్ నందు ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన మటక కేసు నమోదు ఆర్డీవోకు గదిని జప్తు చేయాలనే సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు. కావున ప్రజలందరూ గమనించి జాగ్రత్తగా ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఇల్లులు భవనాలు అద్దెకు ఇవ్వకుండా  గమనిస్తూ ఉండాలని తెలిపారు.
Comments