బిజెపి తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు....ఎవరు.?

Madupa Santhosh CEO
HYD: బిజెపి తెలంగాణ రాష్ట్ర  నూతన అధ్యక్షులు....ఎవరు.?
హైదరాబాదు: అక్షరతెలంగాణ : 
ఇటివల రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న తరుణంలో.   తెలంగాణలో చోటుచేసుకున్న బిజెపి రాజకీయ పరిణామాలు.
  తెలంగాణ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాల ద్వారా సామాజిక వర్గాల వారీగా పట్టు పెంచుకునేందుకు సీఎం రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా చెబు తున్నారు. ఇదే సమయంలో బీజేపీ అలర్ట్ అయింది. ఏపీలో సక్సెస్ అయిన కూటమి తెలంగాణ లోనూ అమలు పైన ఆలోచన చేస్తోంది. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో ఊహించని రాజకీయం తెర మీదకు వస్తోంది.
బిజెపి దక్షిణాది రాష్ట్రాలలో మెరుగైన విజయాలు తెలంగాణ లో ఉన్నందున బీజేపీ
ఆపరేషన్ తెలంగాణ
దక్షిణాదిలో తెలంగాణ నుంచి తమ ఆపరేషన్ మొదలు పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్ధమైంది. ఢిల్లీ కసరత్తు తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం పైన త్వరలోనే ప్రకటన రానుంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన పార్టీ నాయకత్వం వచ్చే వారం అధికారికంగా వెల్లడించనుంది. అందులో భాగంగా తెలంగాణలో సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సీఎం నినాదం తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అనూహ్యంగా ఎనిమిది సీట్లు దక్కటంతో తెలంగాణ పైన పట్టు చిక్కినట్లు భావిస్తున్న పార్టీ నాయకత్వం..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో
ఇదివరకు బండి సంజయ్ విషయం లోనే ఏదో పొరపాటు చేసినట్టు వారి మధిలోనే లోలోపల మెదులుతున్న తరుణం లో ఇప్పుడు బిజెపి ఆచితూచి వ్యవహరిస్తోంది.
బీజేపీ తాజా వ్యూహం
బండి సంజయ్ ను తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు మరింత అలర్ట్ అవుతోంది. అధ్యక్షుడితో పాటుగా పార్టీలో కీలక మార్పులకు సమాయత్తం అయినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఇక, పార్టీలో పలు జిల్లాల్లో నాయకుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు పార్టీ గుర్తించింది. దీంతో, అందరినీ కలుపుకొని ముందుకెళ్లే నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించాలని డిసైడ్ అయింది. అధ్యక్షుడి ముదిరాజ్ వర్గానికి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈటెల రేపు ప్రకటన సమయంలో సీనియర్లు తుది ప్రయత్నాలు చేస్తున్నారు. అనూహ్యంగా మురళీధర్ రావు, డీకే అరుణ పేర్లు తెర మీదకు వచ్చాయి.
బీజేపి నాయకులలో కీలక పదవులు తమకే దక్కుతాయని..ఆశాభావం వ్యక్తచేశారు. ఆశా వాదులుగా మిగుతుతారో..నిరాశవాదులుగా ఉంటారో.. వారికే తెలియాలి.
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి.. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండటంతో ఇప్పుడు రెడ్డి వర్గానికి అవకాశం ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో, బీసీ వర్గానికే అధ్యక్ష పదవి ఖాయమైనా..
రేసులో ఉన్న సీనియర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది. ఇదే సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు బీదర్లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందంటూ ఆరోపణలు గుప్పిం చారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనన్నారు. ఇస్తే వద్దనని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఇప్ పటికే తానేంటో నిరూపించుకున్నానని తెలిపారు. కొంత మంది వ్యక్తులు కాబోయే అధ్యక్షుడు తామే అంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. ఇలా ప్రచారం చేసుకోవడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని సంజయ్ చెప్పుకొచ్చారు. దీంతో.. ఇప్పుడు బీజేపీ అధ్యక్ష విషయంలో బీజేపీ తుది నిర్ణయం పైన ఉత్కంఠ పెరుగుతోంది.
Comments