అక్రమ వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు - డీఎస్పీ ఎల్ జీవన రెడ్డి.

Madupa Santhosh CEO
అక్రమ వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు - ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి.అదిలాబాద్ : అక్షరతెలంగాణ : 
గ్రామ అభివృద్ధి పేరుతో విడిసిలు, ప్రైవేటు సంస్థలు వసూళ్లకు పాల్పడితే కేసులు నమోదు.*
జైనథ్ మండలం సాంగ్వి గ్రామంలో ఇసుక ట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేసిన వ్యక్తి, విడిసి పై కేసు నమోదు. చట్ట వ్యతిరేకంగా డబ్బులు వసూలు చేసిన వారిపై పోలీసు కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.గ్రామ అభివృద్ధి పేరుతో చట్ట వ్యతిరేకంగా ఎవరివద్దనైనా గ్రామ అభివృద్ధి కమిటీలు, వ్యక్తులు కానీ డబ్బులు వసూలు చేసిన వారిపై ఎక్స్ట్రాషన్ కేసులు నమోదు చేయబడతాయని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. చట్ట వ్యతిరేకంగా ప్రైవేటు సంస్థలు, వీడీసీలు ఎవరైనా డబ్బులు వసూలు చేసిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. శనివారం జైనథ్ మండలం సాంగవీ గ్రామం శివారు పెన్గంగా నుండి ప్రభుత్వ పనుల నిమిత్తం ట్రాక్టరు లో ఇసుక తీసుకువెళ్తుండగా సాంగ్వి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో చక్రి అను వ్యక్తి  300 రూపాయలు బలవంతంగా ట్రాక్టర్ డ్రైవర్ వద్ద నుండి తీసుకున్నట్లు, ట్రాక్టరు డ్రైవర్ షఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల వద్ద కానీ అక్రమ వసూళ్ళకు పాల్పడినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఇతనిపై క్రైమ్ నెంబర్ .56/2025, U/Sec. 308(2) r/w 3(5) BNS ( 384 r/w 34 IPC) తో జైనథ్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
Comments