సునీతా విలియమ్స్ కు "సుస్వాగతం"

Madupa Santhosh CEO
సునీత విలియమ్స్ కు "సుస్వాగతం"
అక్షర తెలంగాణ: 
అంతరిక్షం నుండి 'అ'వనిత గా అవతరించిన‌ ఆరు పదుల వయసున్న సునీత విలియమ్స్ ప్రస్థానం స్ఫూర్తికి కర్మభూమి అందించిన "భగవద్గీత" ప్రేరణ కావడం విశేషం.
"మీ సంకల్ప శక్తి ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోండి మానసికంగా దుర్భలమై మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి"
- అన్న గీతా వాక్యమిచ్చిన ధైర్యంతో.._
- ఎనిమిది రోజుల ప్రయాణం 280 రోజులకు(9 నెలలు) పైగా సాగిన భయపడక ఆ కాలాన్ని సునితా విలియమ్స్ సద్వినియోగం చేసుకున్న‌ తీరు "నభూతో నభవిష్యతి"._
- 62 గంటల పాటు స్పేస్ వాక్ చేసి,900 గంటల‌ పాటు అంతరిక్ష శాస్త్రీయ పరిశోధన చేసి చరిత్ర సృష్టించిన మీ ధీరత్వం మాలో ప్రేరణ నింపింది.జాబిల్లి అందాలను,భూ భ్రమణాన్ని అస్వాదించడమే గాక..మహా కుంభమేళ చిత్రాలను షేర్ చేస్తూ మనది " వసుధైక కుటుంబం" అని పంపిన‌ మీ సందేశం మాకెప్పటికీ గర్వకారణమే._
- అంతరిక్షంలో తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన సమయంలోనూ ఉపనిషత్తుల పఠనంతో ఆ సంక్షుభిత సమయాన్ని చిరునవ్వుతో అధిగమించిన తీరు అనన్య సామాన్యం.సదా భరతమాత సేవలో.
Comments