' ఉచిత ఇసుక ' ఇందిరమ్మ ఇళ్లకు తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
ADB: ' ఉచిత ఇసుక ' ఇందిరమ్మ ఇళ్లకు తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా: జిల్లా కలెక్టర్ రాజర్షి షా: అదిలాబాద్ : అక్షరతెలంగాణ
ఇసుక వెలికితీత, రవాణా పై లైన్ డిపార్ట్మెంట్స్ ఇసుక జాయింట్ ఇన్స్పెక్షన్ పై కలెక్టరెట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశం లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు పలుసూచనలు సలహాలుచేశారు.తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల తో పాటు ప్రభుత్వపరంగా చేపట్టే నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందించే విధంగా పెన్ గంగ లో ఇసుక లభ్యతపై ఇటీవల సంయుక్త పరిశీలన చే పట్టిన మైనింగ్, ఇరిగేషన్, గ్రౌండ్వాటర్, రెవెన్యూ శాఖల అధికారులు జైనథ్, భీంపూర్, తాంసి, బేల మండలాల్లోని నది పరీవాహక ప్రాంతాల్లోని . వాల్టా చట్టం అనుస రించి ఇసుక వెలికితీయాలని నిర్ణయించారు. తహ సీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియ చేపట్టనున్నారని ఎంపిక చేసిన భీంపూర్ మండలం అంతర్గాంలో ఇసుక మందం 1.5 మీటర్లుగా గుర్తించిన అధికారులు గుబిడి, వడూర్, తాంసి-కే గ్రామాల్లో, అలాగే జైనథ్ మండలంలోని సాంగ్వి -కే, ఆనంద్పూర్, భోరజ్ మండలంలో డో ల్లరా, పెండల్వాడలో 0.5 మీటర్లుగా, బేల మండ లంలో మణియర్పూర్, సాంగిడి గ్రామాల్లో 1.5 మీ టర్లుగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా గ్రామాల్లో ను౦చి ఇసుకను ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందని ఆయా మండలాల తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఉచిత ఇసుక సరఫరా చేపట్టి, ఇసుక అవసరమున్న ఇందిరమ్మ లబ్దిదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లు ముందుగా సంబంధిత తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకొని వారికి 
ప్రాధాన్యత క్రమంలో తహసీల్దార్లు వే బిల్లులు జారీ చేయడం జరుగుతుందన్నారు. వాటి ఆధారంగా నిర్దేశించిన సమయాల్లో  ఇసుకను తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆయా వాహనాల డ్రైవర్లకు లైసెన్స్ తో పాటు వాహనానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, ఇసుకను ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది తహసీల్దార్ల కు తప్పనిసరిగా సమాచారంఅందించాలని ఎక్కడ డంప్ చేశారనేది వారు స్వయంగా పరిశీలిస్తారన్నారు 
నిబంధనలకు విరుద్ధంగా డంప్ చేసినా, నిర్దేశిత పనులకు కాకుండా ఇతర వాటికి తరలించినా చట్టప్రకారం ఆ డంప్ ను సీజ్ చేయడంతో పాటు బాధ్యుల పై చర్యలుంటాయని , అక్రమంగా రవాణా చేస్తే మొదటిసారి 5000, రెండవ సారి 15, 000  జరిమానా విధించడం జరుగుతుందని  తెలిపారు.  అంతకంటే ఎక్కువసార్లు ఇసుక ఆక్రమణలు జరిగితే నిబంధనల ప్రకారం ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు 
ఇసుక అవసరమున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ   వినోద్ కుమార్, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
Comments