కాళేశ్వరం వివాదం అసలెంటి...? మాజీ సిఎం కేసీఆర్ దోషిగా తేలితే...!

Madupa Santhosh CEO
కాళేశ్వరం వివాదం అసలేంటీ.? మాజీ సిఎం కేసీఆర్ దోషిగా తేలితే.....?
హైదరాబాద్ : డెస్క్ న్యూస్: అక్షరతెలంగాణ
 తెలంగాణ మలి దశ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర.. ఆ మరుపురాని ఆ పోరాటాలు నెమరు వేసుకుందాం.
ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తుతున్న రోజుల్లో సాగిన తెలంగాణ తొలిదశ ఉద్యమం వల్ల ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాలేదు. కానీ, ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల సమయంలో యువత అంతా కెరీర్ వైపు మొగ్గుచూపుతున్న దశలో మొగ్గ తొడిగిన మలిదశ తెలంగాణ ఉద్యమం దశాబ్దాల కలను సాకారం చేసింది.
 ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తుతున్న రోజుల్లో
సాగిన తెలంగాణ తొలిదశ ఉద్యమం వల్ల ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాలేదు. కానీ, ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల సమయంలో యువత అంతా కెరీర్ వైపు మొగ్గుచూపుతున్న దశలో మొగ్గ తొడిగిన మలిదశ తెలంగాణ ఉద్యమం దశాబ్దాల కలను సాకారం చేసింది. అదీ శాంతియుతంగా. ఇదెలా సాధ్యమైంది? ఒక దార్శనికుడు, ఒక ఉద్యమకారుడు, ఒక వ్యూహ కర్త, ఒక రాజకీయ చతురుడు, ఒక మానవతా మూర్తి అన్నీ కలిసి పోతపోసుకున్న ఒకే వ్యక్తి వల్ల సాధ్యమైంది.

కాళేశ్వరం ఎక్కడ నిర్మించారు.? దాని ఉద్దేశం ఏంటి.?
“తెలంగాణ మీదుగా వెళ్లే గోదావరి నీరు ఈ ప్రాంతానికి అందడం లేదు.. తెలంగాణ వస్తేనే గోదావరి నీళ్లు మనకు దక్కుతాయి”. ఇదీ.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పిన మాట. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ఈ దిశగా అడుగులు వేశారు.
ఇందులో భాగంగానే జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కన్నెపల్లి సమీపంలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టారు. తెలంగాణలో 13 జిల్లాల్లో 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నదే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
 కాళేశ్వరం ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఓ అద్భుత మానవ నిర్మాణం. కానీ ఇప్పుడు దీని చుట్టూ వివాదాలు చుట్టుముట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు, వివాదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు.

గోదావరి నీటిని ఎత్తిపోస్తూ తెలంగాణలో జిల్లాలకు సాగు, తాగు నీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే మల్టీ సెజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచింది. 2016లో ఈ ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2019 జూన్ 21న ఈ ప్రాజెక్టును కేసీఆర్ జాతికి అంకితం చేశారు. మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావడం విశేషం.
ప్రాజెక్టు ముఖ్యంశాలు:
- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు 80 వేల ఎకరాల భూమిని సేకరించారు.
- 1832 కిలోమీటర్ల మేర గోదావరి నీటి సరఫరా జరిగేలా ప్రణాళికలు రచించారు.-ఇందులో భాగంగా 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ ద్వారా, 203 కిలోమీటర్ల సొరంగ మార్గంలో నీటిరి తరలించేలా నిర్మాణం చేపట్టారు.

- ప్రాజెక్టులో భాగంగా 20 లిఫ్ట్లు, 19 పంపు హౌజ్లు, 19 రిజర్వాయర్లను రూపొందించారు. మరోవైపు వివాదాలు

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. 2023 అక్టోబర్లో ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడంతో వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల భద్రతపై విచారణ ప్రారంభించింది.

అవినీతి జరిగిందంటూ ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పటి బీఆర్ఎస్ అవినీతి చేసిందని ఆరోపించిన కాంగ్రెస్ విచారణ మొదలు పెట్టింది. కాళేశ్వరం కమిషన్ విచారణ పేరుతో కమిటీని ఏర్పాటు చేశారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని ఈ కమిటీ ఇప్పటికే
పలువురు అధికారులను విచారించగా. తాజాగా పాజెక్అవినీతి జరిగిందంటూ ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పటి బీఆర్ఎస్ అవినీతి చేసిందని ఆరోపించిన కాంగ్రెస్ విచారణ మొదలు పెట్టింది. కాళేశ్వరం కమిషన్ విచారణ పేరుతో కమిటీని ఏర్పాటు చేశారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని ఈ కమిటీ ఇప్పటికే పలువురు అధికారులను విచారించగా. తాజాగా ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కీలక బాధ్యతల్లో ఉన్న హరీష్ రావు, ఈటల రాజేందర్ను విచారించగా తాజాగా కేసీఆర్ను విచారించింది.

ప్రాజెక్టుపై వచ్చిన ప్రధాన ఆరోపణలు ఇవే.
మేడిగడ్డ బ్యారేజ్ లో నిర్మాణ లోపాలు ఉన్నాయి. గోదావరి ప్రవాహాన్ని ఎదుర్కొనలేని స్థాయిలో నిర్మాణం ఉండటం.
 మునుపటి ప్రణాళికను మార్చడం వల్ల వ్యయం పెరిగిందని ఆరోపణ. అవసరం లేని మార్పులతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్న విమర్శలు వచ్చాయి. భారీగా ఖర్చు పెట్టినా, రైతులకు పూర్తిగా నీరు అందడం లేదు. అనేవి ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
కార్యదక్షుడు కేసీఅర్ పై కక్షనా....

కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ దార్శనికతకు తార్కాణం. ఆయన పట్టుదలకు, కార్యదక్షతకు కండ్ల ముందున్న సాక్ష్యం, తెలంగాణ ప్రజలపై, ముఖ్యంగా రైతులపై ఆయనకున్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. కరువుతో అల్లాడి నెర్రెలు బారిన తెలంగాణ భూములకు జీవం పోసిన జీవనాడి కాళే శ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ ఉక్కు సంకల్పం, ముందుచూపు లేకపోయి ఉంటే ఇంత భారీ ప్రాజెక్టు, అంత తక్కువ సమయంలో పూర్తికావడం వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో అసాధ్యం.
కాళేశ్వరం నిర్మాణం వెనుక తెలంగాణ ప్రజల కాదాహార్తి ఉన్నది. వలస పాలనలో బీడుగా మారిన తెలంగాణ నేలతల్లి గుండె కోత ఉన్నది. వలస పాలకులు గోదావరి నీళ్లను తరలించుకుపోతే కరువు కాటుకు బలైపోయిన రైతుల కుటుంబాల కన్నీటి వ్యధ ఉన్నది. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల బాధ లను చూసి చలించిపోయిన కేసీఆర్ ఉక్కు సంకల్పం ఉన్నది. రైతుల కష్టాలను దూరం చేయాలంటే గోదార మ్మను ఎదురెక్కించాల్సిందే అని కేసీఆర్ నాడే నిర్ణయిం చుకున్నారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గోదా వరి నీటిని ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సంకల్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును భుజాలకెత్తుకున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా తట్టుకో ని నిలబడ్డారు. అకుంఠిత దీక్షతో, నిరంతర పర్యవేక్షణ తో ప్రాజెక్టును అనుకున్నదానికంటే వేగంగా పూర్తిచే యించారు. కాళేశ్వరం వెనుక హరీశ్రావు కృషి ఎంతో ఉన్నది. కేసీఆర్ కార్యదీక్షలో మంత్రిగా ఆయన ఎప్పటి

కప్పుడు కాళేశ్వరం పురోగతిని సమీక్షించారు. కాళేశ్వ రాన్ని కేసీఆర్ ఒక సాగు నీటి ప్రాజెక్టుగానే చూడలేదు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి, రైతుల భవిష్యత్తుకు భరో సాగా నిలిచే గొప్ప యజ్ఞంలా భావించారు.
కేసీఆర్ అనుకున్నట్టే కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలం గాణ వ్యవసాయరంగంలో విప్లవం వచ్చింది. నీళ్లు లేక దశాబ్దాలుగా బీడు భూములుగా ఉన్న ప్రాంతాలు పంట పొలాలతో కళకళలాడాయి. కాళేశ్వరం నీళ్లు పారే మార్గమంతా భూగర్భ జలాలు పెరిగాయి. చాలాచోట్ల ఉన్న తాగునీటి సమస్య పరిష్కారమైంది. మత్స్య పరి శ్రమ ఊపందుకున్నది. నీటి లభ్యత పెరిగి, మేత దొరికి పశుసంపద కూడా వృద్ధి చెందింది. పాడి, పంటలతో రైతుల ఆదాయం పెరిగింది. భూములకు విలువ వచ్చింది. పశుసంపద, మత్స్య సంపద పెరుగుదలతో ప్రజలు పోషకాహారం తీసుకోవడంతో జీవన ప్రమా ణాలు మెరుగయ్యాయి. ఆరోగ్యం పెరిగింది. ఇలా కాళే శ్వరం ప్రాజెక్టు తెలంగాణపై ఎంతో ప్రభావం చూపిం చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిర్మాణం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వావలంబనకు ప్రతీక కేసీఆర్ నాయకత్వ పటిమకు, తెలంగాణ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న అంకితభావానికి తిరుగు లేని నిదర్శనం.
తెలంగాణలో 2014లో 68 లక్షల టన్నుల ధాన్యం

దిగుబడి వస్తే, 2023 కల్లా అది 2.70 కోట్ల టన్నులకు పెరిగింది. దీనికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టే కదా? అంతే కాదు, సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యింది. మత్స్య శాఖ గణాంకాల ప్రకారం.. 2016-17లో 1.93 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అయితే, 2021లో అది 3.49 లక్షల టన్నులకు పెరిగింది. అంటే నాలుగేండ్లలో చేపల ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయ్యింది. కాళేశ్వరం నీటితో ఊర్లల్లో చెరువులను నింపడం, ఎండకాలం కూడా అవి నీళ్లతో కళకళలాడటం వల్లే ఈ స్థాయిలో మత్స్య సంపద పెరిగింది. కాళేశ్వరంతో పాటు ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత తెలంగాణలో భూగర్భజలాలు సగటున 5 మీటర్లు పెరిగినట్టు భూగర్భ జల శాఖనే ఒక నివేదికలో వెల్లడించింది.

'కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ ప్రగతికి, భాగస్వా

మ్యానికి శాశ్వత చిహ్నం' అని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ సంస్థ అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ కితాబిచ్చింది. 'కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ బాగుంది, ఇదొక అద్భుతమైన ఇంజినీ రింగ్' అని సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రశంసించింది.
 కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు' అని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గడ్కరీ మెచ్చుకున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై డిస్కవరీ చానల్ ఏకంగా డాక్యుమెంటరీనే ప్రసారం చేసింది. కాళేశ్వరాన్ని రైతులకు ప్రయోజనం చేకూర్చే అద్భుతమైన ప్రాజెక్టుగా నాబార్డ్ కొనియా డింది. పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ నేతలు కాళే శ్వరం ప్రాజెక్టును సందర్శించి ఆశ్చర్యపోయారు. అఖ రికి తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన చంద్రబాబు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకోకుండా ఉండలే కపోయారు.

ఇంతటి ఘనత సాధించిన కాళేశ్వరాన్ని చూసి కాం గ్రెస్కు కన్నుకుట్టింది. కాళేశ్వరం నీళ్లు వచ్చినన్ని రోజు లు ప్రజలు కేసీఆర్ నీ గుండెల్లో పెట్టుకుంటారని, తెలం గాణలో తమకు రాజకీయ సమాధి తప్పదని భయప డ్డది. కాళేశ్వరంలో అవినీతి అంటూ ఎన్నికల సమ యంలో అబద్ధపు ప్రచారాన్ని ప్రారంభించింది. మేడి గడ్డ బ్యారేజీలో పిల్లర్ కుంగిపోవడంతో తన విష ప్రధా రాన్ని విస్తృతం చేసింది. నిజానికి ఆ పిల్లర్ కుంగిపో వడం సహజంగానే జరిగిందా.. లేక కుట్రనా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. లక్కీ లాటరీలో అధికారంలోకి వచ్చి న రేవంత్ రైతుల కోసం ఏం చేశాడు? మేడిగడ్డకు మర మ్మతులు చేయవచ్చని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీనే చెప్పినా కనీసం పట్టించుకోలేదు. ఓ విచారణ కమిషన్ వేసి రైతుల జీవితాలను పణంగా పెట్టి టైంపాస్ చేస్తు న్నాడు. రేవంత్ కు ప్రజలపై ప్రేమ, తెలంగాణ పట్ల బాధ్యత ఉంటే మేడిగడ్డకు మరమ్మతులు చేసేవాడు. కానీ, చేయడు. ఎందుకంటే రిపేర్ చేస్తే 'కాళేశ్వరం బాగానే ఉంది' అని అధికారికంగా ప్రకటించాల్సివ స్తుంది. అలా చేస్తే కాళేశ్వరంపై దుష్ప్రచారం ఉత్తదేనని తేలిపోతుంది. ప్రజల్లో తాను పలుచనైపోతాడు. ఆం దుకే రైతులు నష్టపోయినా సరే.. చోద్యం చూస్తున్నాడు.
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఓ మేరునగ ధీరుడు. ఆయన ఓ శిఖరం. ప్రజల గుండెల్లో ధైర్యం, రైతులకు బంధువు. ముసలో ళ్లకు పెద్దకొడుకు. ఆడపిల్లలకు మేనమామ. తెలంగాణపై ఆయన ముద్ర చెరగనిది. తెలం గాణ ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం రాజకీయాలకతీతమైనది. రాజకీయ ఆరోపణల ద్వారా అభిమానాన్ని పోగొట్టాలని రేవంత్ చేస్తున్న ప్రయత్నం కేవలం కుట్ర. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పేరిట నోటీసులు కూడా ఆ కుట్రలో భాగమే.
కాళేశ్వరం నిర్మాణంలో హనుమంతుడిగా కార్యదక్ష తను చాటుకున్న హరీష్ రావును మొన్న విచారణకు పిలిచారు. నేడు కేసీఆర్ విచారణకు వెళ్లనున్నారు. తద్వారా వారి వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ, 'సాక్షాత్తూ కేసీఆర్నే విచా రణకు పిలిపించాం' అని చెప్పుకోవడం తప్పితే కాంగ్రెస్ ఇందులో సాధించేదేమీ ఉండదన్న సంగతి తెలంగాణ ప్రజానీకానికి ఎప్పుడో అర్థమైంది. కుట్రలను తెలం గాణ ప్రజలు ఎన్నటికీ ఆమోదించరు. తెలంగాణ జీవన, ఆర్థిక గమనాన్నే మార్చేసిన కాళేశ్వరంపై ఆబ ద్దాలు, కేసీఆర్పై నిందలు, విచారణ ఇదంతా ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడమే.. దీనివల్ల కేసీఆర్ ప్రతిష్ఠ తగ్గకపోగా రేవంత్ బూటకపు ప్రచారం పటాపంచలవు తుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభమరింత తేజోవంతమై ప్రకాశిస్తుంది. ఇందులో ఎవరికీ, ఏ మాత్రం సంశయం అక్కరలేదు.కేసీఆర్ దోషిగా తేలితే ఏమవుతుంది?
ప్రభుత్వాధికారి హోదాలో అక్రమ నిర్ణయాలు తీసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదవవచ్చు.
అవినీతి నిరూపితమైతే ఐపీసీ 409 (భారత శిక్షాసమితి పబ్లిక్ ట్రస్ట్ ఉల్లంఘన) కింద శిక్ష పడే అవకాశం ఉంది. కేసు తీవ్రత ఆధారంగా 7 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న దానికి సంబంధించిఆధారాలు....బయటకు వచ్చేనా... అప్పుడు...ఏమౌతుందో.. చూద్దాం.
Comments