గాయపడిన వారిని పరామర్శించిన ప్రధాని మోడీ.. విమాన ప్రమాదం పై లోతైన దర్యాప్తు...National: news అక్షరతెలంగాణ
: విమాన ప్రమాద ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ కాగానే గురువారం కొన్ని. నిముషాల వ్యవధిలోనే జనావాసాల్లో కుప్పకూలిపోయింది.
ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 242 ఉన్నారు. చనిపోయిన వారిలో మనదేశంలో పాటు, విదేశీయులు కూడా ఉన్నారు. అప్పటి వరకు విమానం టేకాఫ్ కోసం ఎదురు చూసిన వాళ్లంతా.. సెకన్ ల వ్యవధిలోనే విమానం పేలిపోయి మాంసపు ముద్దులుగా మారిపోయారు.
ఈ ఘోర ప్రమాదంలో.. ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఉన్నట్లు సమాచారం. అయితే.. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం నుంచి బైటపడిన ఒకే వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్. ఆయన విమాన ప్రమాదం జరిగినప్పుడు.. 11 ఏ సీటులో కూర్చున్నాడు.
అతను కూర్చున్న సీటుకు దగ్గరే ఎమర్జెన్సీ విండో ఉందని అందుకే ఆయన వెంటనే ఆ విండో నుంచి దూకి చిన్న గాయాలతోనే బైటపడ్డారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఆస్పత్రిలో ఇటీవల కొలుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ అందరు అనుకుంటున్నట్లు తాను ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు.
విమానం జనావాసాల మీద పడినప్పుడు. రెండు ముక్కలైందని.. దీంతో తాను కూర్చున్న సీటుతో పాటుగా ఎగిరి దూరంగా పడ్డానని చెప్పాడు. తన శరీరంకు కొద్దిగా మంటలు వ్యాపించాయని, ఎడమ చెయ్యికి గాయాలయ్యాయని చెప్పాడు. ఎలాగోలా బలం కూడ గట్టుకుని ఆ శిథిలాల నుంచి బైటకు
వచ్చానని చెప్పాడు. ఈక్రమంలో ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రధాని మోదీ సైతం.. విశ్వాస్ కుమార్ ను పరామర్శించారు. విమాన ప్రమాదం గురించి అంతా షాకింగ్ గా ఉందని.. ఎలా బతికానో కూడా అర్థం కావట్లేదని మాట్లాడాడు. మరోవైపు.. కొన్ని ఏళ్లుగా భార్య బిడ్డలతో లండన్లో ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రమాద సమయంలో తన సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడని, ఆయన ఆచూకీ తెలియరాలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం విశ్వాస్ కుమార్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఒక్క ప్రమాదం రూ. 12వందల కోట్ల బీమా భారం.. విలవిలలాడుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు
ఒ క్క ప్రమాదం 12వందల కోట్ల రూపాయల బీమా క్లెయిమ్లకు దారీతీయనుంది. నిన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయిన ఘటనలో 241 మంది మృత్యువాత పడ్డారు.
మృతులకు సంబంధించి బీమా క్లెయిమ్స్ చెల్లింపులు ఇన్సూరెన్స్ కంపెనీలపై భారంగా పరిణమించనున్నాయి. ఈ భారం భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీలపై పరిమితంగా ఉండవచ్చు.. యూకే రీఇన్సూరెన్స్ కంపెనీలపై అధిక భారం పడనుంది.
1999లో జరిగిన మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం, విమాన ప్రయాణీకుల మరణం లేదా గాయం వల్ల కలిగే నష్టానికి అన్ని విమానయాన సంస్థలు ఖచ్చితంగా బాధ్యత వహిస్తాయి. ఫ్లైట్ నష్టం, ప్యాసింజర్, థర్డ్-పార్టీ చెల్లింపులు గ్లోబల్ ఏవియేషన్ ఇన్సూరెన్స్ సెక్టర్పై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంలో భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు, గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలు 120 మిలియన్ డాలర్ల- 150 మిలియన్ డాలర్ల వరకు మన కరెన్సీలో వెయ్యి నుంచి 12వందల కోట్ల రూపాయాలు క్లెయిమ్లు ఎదుర్కొననున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రమాదంలో ధ్వంసమైన బోయింగ్ 787 డ్రీమ్ఎనర్ విమానం విలువ 75 మిలియన్ డాలర్ల నుంచి 85 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఏవియేషన్ ఇన్సూరెన్స్కు సంబంధించి విమానం మొత్తం నష్టం విలువకు క్లెయిమ్ చేస్తే, అంతే మొత్తం ఇవ్వాల్సి
ఉంటుంది. ఇక ప్రమాదంలో చనిపోయిన ప్రతీ ఒక్క ప్రయాణికుడి కుటుంబానికి చెల్లించాల్సిన కోటి రూపాయలు అదనం. ఈ విధంగా ప్రయాణికుల కుటుంబాలకు చెల్లించాల్సిన మొత్తం రూ. 240 కోట్లు అదనంగా ఉంటుంది. విమాన నష్టం, ప్రయాణికులు ఇన్సూరెన్స్ అన్నీ కలిపితే 12వందల కోట్ల భారం తప్పందటున్నారు నిపుణులు.
Comments