పుష్కర స్నానాలు ఎందుకు చేయాలి...? గోదావరీ పుష్కరాలకు ముహుర్తం ఖరారు: ఎప్పుడంటే..
హైదరాబాద్ : డెస్క్ న్యూస్: అక్షరతెలంగాణ
గోదావరి పుష్కరాలు 2027 కు ముహూర్తం ఖరారు అయ్యింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు తరలి వచ్చే ఈ పుష్కరాలను ప్రభుత్వం ప్రతిస్థాత్మకంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో స్థానిక నేతలు, సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ముందస్తు కార్యాచరణ కూడా సిద్ధం చేశారు అధికారులు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నట్లు తెలుస్తోంది. పుష్కరాల నిర్వహణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.
జూలై 23, 2027 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. 2015 లో పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగుల్చాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి కోసం రూ.904 కోట్లతో ప్రతిపాదలు సిద్ధం చేశారు అధికారులు.
అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేశారు. అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలా చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు
భక్తులకు ముందస్తు సకల ఏర్పాట్లు:
పుష్కరాల నిర్వహణ కోసం జిల్లాను యూనిట్గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లు చేపట్టామని మంత్రులు తెలిపారు.
2027 లో గోదావరి పుష్కరాలు: జులై 23 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడంపై దేవాదాయశాఖ దృష్టి సారించింది.
రాష్ట్రంలో బాసర నుంచి భద్రాచలం వరకు నదీతీరం 106 పుష్కరఘాట్ల ఆధునికీకరణ రూ.50 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని దేవాదాయశాఖ వినతి
గోదావరి పుష్కరాలు 2027
జులై 23 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడంపై దేవాదాయశాఖ దృష్టి సారించింది. శాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్ తోపాటు పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాన్రెడ్డి ఇటీవల ప్రయాగ్రాజ్కు వెళ్లి మహాకుంభమేళాకు అక్కడ అనుసరించిన విధానాలను అధ్యయనం చేశారు. పుష్కరాల్లో కీలకమైన పుణ్యస్నానాలకు రాష్ట్రవ్యాప్తంగా నదీతీరం వెంబడి ఉన్న 106 పుష్కరఘాట్లను ఆధునికీకరించడంతోపాటు కొత్తవి నిర్మించాలని నిర్ణయించారు. అలాగే ఆయా ఆలయాల ప్రాంతాల్లో భక్తుల తాకిడికి తగ్గట్లుగా సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ పనులకు రూ.50 కోట్ల నిధులు అవసరమని ప్రాథమికంగా గుర్తించిన దేవాదాయశాఖ రానున్న రాష్ట్ర బడ్జెట్(2025-26)లో కేటాయించాలని ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్కకు విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనల్లోనే పుష్కరాలు
2027 జులై 23 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015లో తొలిసారి గోదావరి పుష్కరాలు జరిగాయి. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ సమీపంలో జన్మించే గోదావరి తెలంగాణలో బాసర నుంచి భద్రాచలం వరకు ప్రవహిస్తుంది. తీరం వెంబడి బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం వంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
గోదావరి నది పుష్కరం : పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి: పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం
ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.
భారతదేశంలో గంగానది తరువాత అంత పేరుగాంచిన జీవ నది గోదావరి నది. ఈ గోదావరి నదిని దక్షిణ గంగగా అభివర్ణిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం గల ఈ పుణ్య నది యొక్క రాశి సింహరాశి. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి యమునా నది పుష్కరాలు తరువాత గోదావరి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో పుణ్యనగరి రాజమండ్రికి దేశ విదేశాల నుండి భక్త జనం పోటెత్తుతుంది. లక్షలాది భక్తులు గోదావరి నది స్నానం కోసం రాజమండ్రి వస్తారు. ఈ సమయం రాజమండ్రి నగరం ప్రతేక శోభతో విరాజిల్లుతుంది.
1884 లో తారణనామ సంవత్సరంలో గోదావరి పుష్కర సంభంరం ప్రారంభమైంది. అపుడు 'గోదావరి పుష్కర యాత్రికులు ఉత్కళ దేశం నుండి, నిజాం రాష్ట్రం నుండి, తక్కిన ఆంధ్ర మండలం నుండి వచ్చారు' అని చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తన `స్వీయచరిత్ర' లో రాసుకున్నారు.
1896 పుష్కరాలు: పుష్కర యాత్రికుల కోసం అప్పటి బ్రిటీష్ వారుకోటి లింగాల వద్ద తాటియాకుల పందిళ్లు, పాకలు వేయించి వసతులు ఏర్పాటుచేశారు. దర్మవరం సంస్థానం ప్రోప్రయిటర్ కంచుమర్తి రామచంద్రారావు జమీందారు యాత్రికులు సౌకర్యంకోసం నీళ్ల పైపులను వేయించారు.
అంతేకాకుండా రహదారులు కూడా వేయించారు.
ఎలిపిన్ స్టన్ సబ్ కలెక్టర్ గోదావరిరేవులో జనం పడిపోకుండా, కర్రలు పాతించారు. కలరా రాకుండా వైద్యం అందించారు.
ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి సూచించారు. దాంతో అప్పటి టి.టి.డి. ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ పి.వి.ఆర్.కె ప్రసాద్ గారు ప్రణాళికారచన ప్రారంభించారు. 1979 వరకూ జరిగాయి.
రాజమండ్రి లోని సుబ్రహ్మణ్య మైదానంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. అందుకోసం తిరుమల నుండి అర్చకులను, సిబ్బందిని తీసుకొని వచ్చారు.
మైదానం అంతా పండాల్స్ నిర్మించి అర్ధరాత్రి వరకు హరికథలు, పురాణ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మొదలైన ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహించారు.
కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక గ్రంథాలను పంపిణీ చేశారు. ఒక్కొక్క పుస్తకాన్ని పది వేలకు పైగా ముద్రించి నామమాత్రపు ధరకు విక్రయించగా అందుకు విశేష ఆదరణ లభించింది.
1991 పుష్కరాలు (ఆగష్టు 14 నుంచి 25 వరకు )
1979 పుష్కరాల్లో వచ్చిన స్పందన, ప్రజల్లో వచ్చిన గుర్తింపుని చూసి రెండవసారి అనగా 1991లో కూడా ధార్మిక సేవలు అందించడానికి టి.టి.డి. ముందుకువచ్చింది. మున్సిపల్ ఆఫీసులో జిల్లాస్థాయిలో జరిగిన పుష్కర ఏర్పాట్ల విస్తృతస్థాయి
1956 పుష్కరాలు (మే 3 నుంచి జూన్ 2 వరకు)
మన భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి పుష్కరాలు. అన్ని పుష్కరాల విధంగానే ఈ పుష్కరాలకు కూడా అధికారికంగా తేదీలు నిర్ణయించారు. అయితే ఆ తేదీలు సరైనవి కావని పండితులు మరో తేదీలు ఖరారు చేశారు. కనుక 24 రోజులు పుష్కరాలు చేయడం తప్పనిసరి అయింది. వేద సండితులు నిర్ణయించిన ప్రకారం మే 3 నుంచి 14 వ తేదీ వరకు పుష్కరాలు జరిగాయి. అధికారులు మే 22 నుంచి జూన్ 2 వరకి పుష్కరాలను జరిపించారు.
1967 పుష్కరాలు (సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు)
1979 పుష్కరాలు (ఆగష్టు 29 నుంచి సెప్టెంబర్ 9 వరకు)
1979 పుష్కరాల్లో తితిదే తరపున ప్రత్యేక అధికారిగా డా. రావుల సూర్యనారాయణమూర్తి గారు నియమించబడ్డారు. ఆ సమయంలో తితిదే తరపున రాజమండ్రిలో ఏదో ఒక కార్యక్రమం చేయమని అప్పటి
సమావేశానికి టి.టి.డి తరపున డా. రావుల సూర్యనారాయణమూర్తి గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో అప్పటి జిల్లా కలెక్టర్ రఫదీస్ సూడాన్, జాయింట్ కలెక్టర్ ఉమామహేశ్వరరావు, రెవెన్యూ కార్యదర్శి కె.ఎస్.ఆర్. మూర్తి, పుష్కరాల ప్రత్యేక అధికారిగా కృష్ణయ్య పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్య మైదానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సమాచార ప్రచారశాఖకు స్టాల్స్ పెట్టుకోవడానికి కేటాయించారు. టి.టి.డి. ధార్మిక సేవలకు వేరే స్థలాన్ని ఇచ్చారు. అయితే పవిత్ర గోదావరిలో స్నానంచేసి, దైవదర్శనం చేసుకొని కొంచెంసేపు ఆధ్యాత్మికంగా కాలక్షేపం చెద్దామనుకుంటున్న భక్తులకు అందుబాటులో ఉన్న స్థలం కావాలని, కాబట్టి సుబ్రహ్మణ్య మైదానాన్ని టి.టి.డి. ధార్మిక సేవలకు ఇవ్వాలని సూర్యనారాయణమూర్తి గట్టిగా పట్టుబట్టడంతో ప్రభుత్వం అంగీకరించింది.
దాంతో గత పుష్కరాల మాదిరిగానే అన్ని ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు వచ్చిన ప్రతి భక్తుడు టి.టి.డి. దేవాలయాన్ని దర్శించకుండా వెళ్లేవారుకాదు. చాలాసేపు ఆ పవిత్ర స్థలంలోనే ఉండి వెళ్లేవారు. స్వామివారి లడ్డులను కూడా విక్రయించారు.
2003 పుష్కరాలు (జూలై 30 నుంచి ఆగష్టు 10 వరకు)
పుష్కర నిర్ణయము-2015
మన్మథ నామ సంవత్సర అధికాషాఢ బహుళ త్రయోదశీ మంగళవారం అనగా 2015 జూలై 14 ఉదయం 6.26 ని.లకు బృహస్పతికి సింహరాశి ప్రవేశము సంభవించింది. [2] కావున ఈ దినము లగాయితు గోదావరి నదికి పుష్కర ప్రారంభముగా ఆచరింపదగును. పుష్కరవ్రతము ద్వాదశ దిన 14-7-2015 నుండి 25-7-2015 వరకు ఆధి పుష్కరములుగా ఆచరింపవలెను. ఈ గోదావరి నదికి మాత్రము అంత్యమందు 12 రోజులు 31-7-2016 నుండి 11-8-2016 వరకు అనగా బృహస్పతి కన్యారాశి యందు ప్రవేశ పూర్వము వరకు పుష్కర కార్యక్రములను యధావిధిగా ఆచరింపవలెను.
2015 సంవత్సరంలో గోదావరి పుష్కరాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించారు.
Comments