ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
రాహుల్ గాంధీ కి మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన
ఓటరు సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా రాహుల్ గాంధీ కి మద్దతుగా ఆదిలాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించిన ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి , మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ . ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, జెండాలు ధరించి రాహుల్ గాంధీ నీ అరెస్టు ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబెడ్కర్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపి అంబెడ్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ ,జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ బెజ్జంకి అనిల్ కుమార్ , జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇన్చార్జ్ గౌలి సంజీవ్ కుమార్ , మాజీ మున్సిపల్ ఫ్లోర్ బండారి సతీష్ , కాంగ్రెస్ పార్టీ మహిళా విభగాం అధ్యక్షురాలు అన్నపూర్ణ , ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్ , మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షాహిద్ , యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్ , మున్సిపల్ కౌన్సిలర్లు జీశాన్ , జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ , సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతీరామ్ , జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు బండి దేవదాస్ చారి , అత్తర్ అలీ , మందాకిని , కాడే సంతోష్ , జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ సిరాజుద్దీన్ , జిల్లా కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మేకలజితేందర్ , మావల గ్రామ సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్ , మావల మండల అధ్యక్షులు కుదురుపాక సురేష్ , మండల , పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజల ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా పారదర్శకతను నిర్ధారించాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షం లేవనెత్తుతున్న “ఓట్ చోరీ” ఆరోపణలపై సమగ్రంగా సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
Comments