ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్ అక్షర తెలంగాణ:
బాబా మరియు అతని గ్యాంగ్ పై ఇప్పటివరకు జిల్లాలో 12 కేసులు నమోదు.
జిల్లాలో 26 మంది వద్ద నుండి రూ కోటి పైగా వసూలు చేసిన దుండగులు.
నిందితుల వద్ద నుండి ఒక కారు, ఒక బైకు , ఏడు మొబైల్ ఫోన్స్, నకిలీ బంగారు నాణేలు, కుండలు పూజకు ఉపయోగించిన బట్టలు స్వాధీనం.
A1. దర్శనాల రాజ్‌కుమార్ @ దర్శనాల రాజు, తండ్రి: అశోక్, వయస్సు: 23 సం., నివాసం: పిప్పల్కోటి గ్రామం, భీమ్పూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా.
A2. అర్ధంగి మహేందర్, తండ్రి: చిన్న భూమన్న, వయస్సు: 35 సం., నివాసం: ఘోట్కూరి గ్రామం, తాంసి మండలం, ఆదిలాబాద్ జిల్లా.
A3. బలేవర్ నవీన్, తండ్రి: మధుకర్, వయస్సు: 24 సం., నివాసం: పిప్పల్కోటి గ్రామం, భీమ్పూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా.
A4. రింగన్ కిరణ్, నివాసం: పిప్పల్కోటి గ్రామం, భీమ్పూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా.
A5. ఏటి శ్యామ్, నివాసం: పిప్పల్కోటి గ్రామం, భీమ్పూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా.
A6. కదిరి అఖిల్, నివాసం: పిప్పల్కోటి గ్రామం, భీమ్పూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా.
A7. ధోనిపెల్లీ అరుణ్ కుమార్, నివాసం: పిప్పల్కోటి గ్రామం, భీమ్పూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా.
ఆదిలాబాద్ స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వివరాలను వెల్లడిస్తూ,
భీంపూర్ పోలీస్ స్టేషన్ పరదీలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు దర్శనల రాజ్ కుమార్ అను వ్యక్తి గత మూడు సంవత్సరాల క్రితం తనకు దేవర వస్తుందని, తనకు మంత్ర శక్తి ఉందని చుట్టూ పక్కల గ్రామాల వారిని నమ్మించినాడు. ప్రజలు అతనిని నమ్మి అతని వద్ద వచ్చి తమ బాదలను, కష్ట సుఖలను చెప్పేవారు, వారికి తన మంత్ర శక్తి ద్వారా కష్టాలను దూరం చేస్తానని నమ్మించడం తో చాలామంది పరిచయం అయ్యారు. అదే క్రమంలో కొంతమందితో అతను, నేను మంత్ర శక్తి ద్వారా బంగారం తవ్విస్తాను, అని నమ్మించి వారినుండి ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకొని అతని బావ మహేందర్ మరియు మిత్రులు నవీన్, అరుణ్, శ్యామ్, అఖిల్ మరియు కిరణ్ లతో కలిసి పథకం ప్రకారం గుప్త నిధులు ఉన్నాయంటూ చెప్పిన వారి ఇంటికి వెళ్ళి అతని మిత్రుల సాయంతో గుంతను తవ్వించి అందులో నుండి తనతో ముందుగా తీసుకొచ్చిన కుండలో మట్టి మరియు ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ కార్డ్ ద్వారా ఆర్డర్ చేసిన నకిలీ నాణేలు కుండలో పెట్టి, ఆ కుండను తవ్వకం లో వెళ్ళినట్టు సృష్టించి దూరం నుండి నకిలీ నాణేలు చూపెట్టి, నమ్మించి తర్వాత ఒక ఎర్రని బట్టతో అట్టి కుండను చుట్టి దానికి 41 రోజులు దాన్ని ముట్టకుండా, పూజలు చేయాలని తర్వతా అతను వచ్చి తీసిస్తానీ చెప్పి నమ్మించి డబ్బులు తీస్కొని పారిపోయేవాడు. ముందే పూజ చేసిన బిందెతీస్తే తీసిన వారు చనిపోతారని భయపెట్టి వెళ్తారు ఆ విదంగా నేరస్థుడు దర్శనల రాజు తన మిత్రులైన నవీన్, అరుణ్, శ్యామ్ అఖిల్ మరియు కిరణ్ మరియు బావ మహేందర్ లతో కలిసి మొత్తం 26 మంది వద్ద నుండి రూ.1,03,80,000 (ఒక కోటి మూడు లక్షల ఎనబై వేలు ) తీసుకొని మోసాగించినడాని ఇప్పుడు వరకు చేసిన దర్యాప్తులో తేలింది. ఇప్పటికీ వీరిపై జిల్లాలోని
బీంపూర్ పోలీస్ స్టేషన్ నందు 6,
మావల పోలీస్ స్టేషన్లో ఒకటి,
నేరడిగొండ పోలీస్ స్టేషన్లో ఒకటి,
బోథ్ పోలీస్ స్టేషన్ నందు రెండు,
రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఒకటి,
జైనథ్ పోలీస్ స్టేషన్ నందు ఒకటి,
*మొత్తం 12 కేసులు నమోదు అయ్యాయి*
ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని వీరి ద్వారా మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు.
డబ్బులు ఊరికే రావని ఇలాంటి నకిలీ బాబాలను నమ్మి ప్రజలు డబ్బులను వేచించకూడదని సూచించారు.
నిందితుల వద్ద నుండి ఒక షిఫ్ట్ డిజైర్ కారు, ఒక బైకు, 7 మొబైల్ ఫోన్లను, గుప్త నిధుల పేరుతో మోసం చేసిన నకిలీ బంగారు నాణాలు కుండలు పలు బట్టలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు.
కేసును చేదించడంలో కీలక పాత్ర పోషించిన జైనథ్ సిఐ, బీంపూర్ ఎస్సై మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు జి శ్రావణ్, ఎస్సై విక్రమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మోసపోయిన బాధితులు.
1. మద్దెల దయాకర్, బుద్దికొండ గ్రామం (నెర్డిగొండ మండలం) – రూ.6,00,000/-
2. ముక్కేర తేజ, తాంసి (కే) భీంపూర్ మండలం – రూ.4,00,000/-
3. మస్కరి అనిల్, పిప్పల్కోటి – రూ.5,00,000/-
4. కరే పవన్ కళ్యాణ్, నిపాణి – రూ.4,50,000/-
5. కదిరి రమాకాంత్, పిప్పల్కోటి గ్రామం – రూ.5,00,000/-
6. కదిరి నవీన్, పిప్పల్కోటి గ్రామం – రూ.4,00,000/-
7. గాలిపల్లి నర్సింగ్, మావల – రూ.5,00,000/-
8. సంగెపు వెంకటరమణ, బుద్దికొండ గ్రామం (నెర్డిగొండ మండలం) – రూ.6,00,000/-
9. నల్ల అరుణ్ కుమార్, కౌట (బి) బోథ్ మండలం – రూ.3,00,000/-
10. ఉదయ్ కుమార్ జొన్నాల, కౌట (బి) బోథ్ – రూ.6,50,000/-
11. కార్తిక్ ఇప్ప, భీమ్సారి గ్రామం (ఆదిలాబాద్ రూరల్) – రూ.6,00,000/-
12. గుమ్మడి గణేష్, మెడిగూడ గ్రామం (జైనాథ్) – రూ.4,00,000/-
13. గోదాల లక్ష్మి, పిప్పల్కోటి – రూ.4,00,000/-
14. గసుగంటి అమ్మి, పిప్పల్కోటి – రూ.3,00,000/-
16. శ్రీకాంత్, వడ్డాడ – రూ.6,00,000/-
17. రాజయ్య, నిర్మల్ – రూ.5,20,000/-
18. పెడింటి అశోక్, అంతర్గావ్ – రూ.3,00,000/-
19. రొడ్డ సతీష్, శాంతినగర్ ఆదిలాబాద్ – రూ.2,00,000/-
20. ప్రవీణ్, జైనాథ్ – రూ.6,00,000/-
21. అశన్న, భరంపూర్ – రూ.1,00,000/-
22. రమేష్, కప్పర్ల – రూ.1,60,000/-
23. అశన్న, కొక్ధూర్ – రూ.1,00,000/-
24. తరుణ్, లకర్వాడ – రూ.3,00,000/-
25. కృష్ణ, ఆదిలాబాద్ – రూ.1,00,000/-
26. చింటూ, జమ్దాపూర్ – రూ.5,00,000/-
మొత్తం మోసపోయిన డబ్బు: రూ.1,03,80,000/- (ఒక కోటి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు)
Comments