రియల్ట్ మోసం 13.31 కోట్లు ఇద్దరు అరెస్ట్: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
ADB: రియల్ ఎస్టేట్ మోసం 13.31 కోట్లు ఇద్దరు అరెస్ట్ - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ

అధిక లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు వసూలు

16 మంది నుంచి సుమారు రూ.13.31 కోట్ల వరకు సేకరించినట్లు విచారణలో వెల్లడి, మరింత దర్యాప్తు కొనసాగుతుంది

ప్రధాన నిందితులు ఇద్దరు అరెస్ట్, రిమాండ్, ముగ్గురిపై కేసు, ఒకరు పరారీలో

నిందితుల వద్ద నుండి ఒక 2 వాహనాలు స్వాధీనం.
పలు స్థలాల డాక్యుమెంట్లు స్వాధీనం.

బ్యాంకు ఖాతాల ద్వారా నగదు బదిలీలపై దర్యాప్తు కొనసాగింపు

 బండారి రాకేష్ తండ్రి పోచన్న,  మోచిగల్లి, ఆదిలాబాద్.ను అరెస్ట్ చేశారు. కుంటవార్ అచ్యుత్ రెడ్డి తండ్రి చంద్రకాంత్ రెడ్డి, గ్రా :సంగిడి  బేలా మండలం, ప్రస్తుతం ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ, ఆదిలాబాద్. ను అరెస్ట్ చేశారు.కుంటవార్ చంద్రకాంత్ రెడ్డి, స్వస్థలం సంగిడి గ్రామం, బేలా మండలం, ప్రస్తుతం ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ,

రూ.13.31 కోట్ల మొత్తం నిందితుడి విచారణలో వెల్లడైన 16 మంది పేర్లకు సంబంధించిన మొత్తాల ఆధారంగా ఉంటుంది; తదుపరి దర్యాప్తులో లావాదేవీలను ధృవీకరించాల్సి ఉంటుంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలిపారు.

ఆదిలాబాద్ శాంతినగర్‌కు చెందిన సాయిని ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదుదారుడి నుంచి రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరుతో విడతల వారీగా రూ.1.40 కోట్లు బ్యాంకు ఖాతాల ద్వారా, అదనంగా రూ.30 లక్షలు నగదు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంత మొత్తాన్ని లాభంగా తిరిగి ఇచ్చి, మిగిలిన మొత్తంపై కాలయాపన చేయడంతో మోసం జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో భాగంగా నిందితుడు బండారి రాకేష్‌ను విచారించగా, కుంటవార్ అచ్యుత్ రెడ్డితో కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేయడానికి కుట్ర పన్నినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. తమకు తెలిసిన వ్యక్తులకు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి PhonePe, Google Pay, బ్యాంకు ఖాతాలు, నగదు రూపంలో డబ్బులు స్వీకరించినట్లు విచారణలో వెల్లడైంది.

ఇప్పటివరకు 16 మంది మరియు ఇతరుల నుంచి సుమారు రూ.13.31 కోట్ల వరకు డబ్బులు సేకరించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు తనకు, తన భార్యకు సంబంధించిన ఖాతాల నుంచి అచ్యుత్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్లు గుర్తించారు. సంబంధిత బ్యాంకు లావాదేవీలు, ఖాతాల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు CCI క్రాస్ రోడ్ వద్ద బండారి రాకేష్, కుంటవార్ అచ్యుత్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో కీలక వివరాలు వెలుగులోకి రావడంతో అరెస్టు ప్రక్రియను పూర్తి చేశారు. మరో నిందితుడు కుంటవార్ చంద్రకాంత్ రెడ్డి పరారీలో ఉన్నట్లు, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో భాగంగా వీరి వద్ద నుండి రెండు వాహనాలు (ఫార్చునర్, థార్) స్వాధీనం చేసుకున్నట్లు, అదే విధంగా పట్టణంలో ఖరీదైన ప్లాట్లు, స్థలాల డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీటిని జప్తు చేసి కోర్టుకు అందజేయడం జరుగుతుంది తెలిపారు.

ప్రజలు అధిక లాభాల ఆశ చూపే వ్యక్తుల మాటలను నమ్మి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా, పెట్టుబడి సంస్థలు, వ్యక్తులు మరియు లావాదేవీల వివరాలను పూర్తిగా పరిశీలించాలని జిల్లా ఎస్పీ సూచించారు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు లేదా మోసం జరిగినట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Comments