ఇంద్రవెల్లి సభతో తెలంగాణలో కొత్త చైతన్యం : మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

Madupa Santhosh CEO
ADB: ఇంద్రవెల్లి సభతో తెలంగాణలో కొత్త చైతన్యం
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ 

అక్టోబర్ 30న పాంచజన్య సంకల్ప సభ..
తెలంగాణ రక్షణ సేన TRS పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అధినేత్రి కల్వకుంట్ల కవితక్క నాయకత్వంపై శ్రీ రాథోడ్‌ బాపురావు  ప్రశంసలు

ఉద్యమకారులకు కేసీఆర్‌ అన్యాయం చేశారు.. రిమ్స్‌లో వైద్య సేవలు మెరుగుపడాలి.

ఆదిలాబాద్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు
 తెలంగాణ ప్రజల సమస్యలను ప్రజావేదికలపై ప్రస్తావిస్తూ, రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ నెల 30న ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు పిలుపునిచ్చారు.

సభ గోడ ప్రతులను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. *తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, సమస్యలను చర్చించేందుకు ఈ సభ కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలపై కవితక్క పోరాటం
తెలంగాణ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై తమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారని రాథోడ్‌ బాపురావు. అన్నారు. ఇంద్రవెల్లి సభలో మారుమూల ప్రాంతాల అభివృద్ధి, విద్య, వైద్యం, రహదారుల వంటి అంశాలను ప్రస్తావిస్తామని తెలిపారు.
 ప్రజల్లో సభ పట్ల ఆసక్తి కనిపిస్తోందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు.

ఉద్యమకారులకు కేసీఆర్‌ అన్యాయం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తగిన గుర్తింపు ఇవ్వలేదని బాపూరావు విమర్శించారు.
. ఉద్యమ సమయంలో ప్రజలతో కలిసి పోరాడిన వారిని పక్కనపెట్టి, *ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపించారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండేదన్నారు
. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

మారుమూల గ్రామాలకు రహదారులేవి?

ఇంద్రవెల్లి పరిసర ప్రాంతాల్లోని గోటపల్లి, తిరిజాపల్లి తదితర గ్రామాలకు సరైన రహదారి సౌకర్యాలు.
కల్పించాలని రాథోడ్ బాపూరావు కోరారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధిపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని, హామీలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
 రిమ్స్‌ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరచాలి 

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో వైద్య సేవలు, అత్యవసర చికిత్సా సదుపాయాలను మెరుగుపరచాలని రాథోడ్ బాపురావు కోరారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు రోగులను హైదరాబాద్‌కు తరలించాల్సి రావడం ఆందోళనకరమన్నారు.
జిల్లా ప్రజలకు స్థానికంగానే నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన వైద్యులు, నిపుణులు, పరికరాలు, ఇతర సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. చిన్నారుల మృతి ఘటనల నేపథ్యంలో వైద్య వ్యవస్థలో లోపాలను సమీక్షించి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
సభను విజయవంతం చేయాలి

అక్టోబర్ 30న ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రాథోడ్‌ బాపురావు  పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను సభ వేదికగా ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో *రాష్ట్ర నాయకులు లలిత, విక్రమ్‌రెడ్డి, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి మాడవి బాపురావు ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి వేణుగోపాల్‌ యాదవ్‌, ఖానాపూర్‌ ఇన్‌చార్జి మెస్రం దయాకర్‌  మరియు పార్టీ జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments