అదిలాబాద్: అక్షరతెలంగాణ
పట్టణం లోని రిమ్స్ ఆసుపత్రిలో NCD clinic ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా .
రిమ్స్ ఆసుపత్రిలో అసాంక్రమిక వ్యాధుల చే బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు NCD clinic ను ప్రారంభించడం జరిగింది. అనంతరం రోగులను పరీక్షించే గది, వ్యాధిగ్రస్తులకు సేవలు అందించే గదులను జిల్లా పాలనాధికారి సందర్శించారు.
NCD clinic లో అసాంక్రమిక వ్యాధులతో (. బి పి, మధుమేహం, క్యాన్సర్ మొదలైనవి) వాటితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఆన్ని రకాల పరీక్షలు నిర్వహించడం, ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని ఆన్నారు.
ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్, NCD జిల్లా కార్యక్రమ అధికారి శ్రీధర్ ఆసుపత్రి సుపరెండెంట్ అశోక్ , గజానన్, అదనపు డి ఎం హెచ్ ఓ , సుమలత డి టి సి ఓ, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
Comments