డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు షాక్

Madupa Santhosh CEO
డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు షాక్

బ్యూరో  డెస్క్:  రెండో సారి అధికారం చేపట్టిన ట్రంప్ (Donald Trump) తన పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగావ్యవహరిస్తున్నారు.కెనడా, మెక్సికో దిగుమతులపై అదనపు సుంకాలు విధించే ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
 అందులో భాగంగా కెనడా (Canada), మెక్సికో (Mexico) దిగుమతులతో పాటు చైనా (China) పై సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ హెచ్చరికలను నిజం చేశారు. ఆయా సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ' కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాల అమలుకు సంతకం చేశాను. ఫెంటనిల్తో సహా మా దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన, ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. మాకు అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు మా సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి కి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

భారత సంతతి అధికారి రోహిత్ చోప్రా పై ట్రంప్ వేటు 

భారత సంతతి అధికారి రోహిత్చో ప్రా వినియోగదారుల ఆర్థిక రక్షణ బ్యూరో డైరెక్టర్ గా బైడెన్ హయాంలో నియమితుడైనాడు . చోప్రాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. క్రెడిట్ రిపోర్టుల నుంచి వైద్య రుణాలను తొలగించడం లాంటి సంస్కరణలను డెమోక్రటిక్ ప్రభుత్వంలో చోప్రా హయాంలో తీసుకొచ్చారు. ఇంతకాలం తమ ఆలోచనలు, అనుభవాలు పంచుకున్న వారందరికీ రోహిత్ చోప్రా తన సామాజిక మాధ్యమ పోస్టులో ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు చోప్రాను ఫెడరల్ ట్రేడ్ కమిషన్ డెమోక్రటిక్ సభ్యుడిగా ఎంచుకున్నారు. తాజాగా ట్రంప్ విధానాలకు అనుగుణంగా పని చేసేందుకూ చోప్రా నేతృతంలోని బ్యూరో సిద్ధమైనా.. అంతలోనే ఆయన్ను తొలగిస్తున్నట్లు ఈమెయిల్ అందింది.
Comments