పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ గడపాలి - జిల్లా ఎస్పీ.
- సుదీర్ఘకాలం దాదాపు 42 సంవత్సరాలు సేవలు అందించి పదవి విరమణ పొందిన ఎస్సై మోహమ్మద్ కలీం
- రెండు తరాలుగా పోలీసు వ్యవస్థకు సేవలు అందించిన ఎస్సై కలీం కుటుంబం.
- శాలువా, పూలమాలతో సత్కరించి బహుమతి ప్రధానం చేసి సాదరంగా సాగనంపిన జిల్లా ఎస్పీ.
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ:
సుదీర్ఘకాలం పోలీసు వ్యవస్థకు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న భీంపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ *మోహమ్మద్ కలీం* ను కుటుంబ సమేతంగా జిల్లా పోలీసు కార్యాలయానికి ఆహ్వానించి పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్. మొదటగా కుటుంబ సభ్యుల సమక్షంలో మహమ్మద్ కలీం దంపతులకు జిల్లా ఎస్పీ పూలమాల శాలువా తో సత్కరించి బహుమతి ప్రధానం చేసి అభినందించారు. ఎలాంటి రీమార్కులు లేకుండా సర్వీసును పూర్తి చేసి పదవీ విరమణ పొందడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థకు చేసిన సేవలు మరువలేనివని, ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత వాతావరణంలో ఉండడానికి ఒకప్పటి సంఘవిద్రవశక్తులతో పోరాటంలో కీలకపాత్ర పోషించి ప్రస్తుత సమాజం శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించినందుకు ఎంతగానో అభినందనలు తెలియజేశారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా జీవించాలని తెలియజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1983 వ సంవత్సరంలో మొహమ్మద్ కలీం పోలీసు కానిస్టేబుల్ గా ఆదిలాబాద్ జిల్లా పోలీసు వ్యవస్థలోకి అడుగుపెట్టి దాదాపు 41 సంవత్సరాల 9 నెలల పాటు పోలీసు వ్యవస్థకు సేవలు అందించి ఈరోజు పదవి విరమణ పొందడం జరుగుతుంది. సర్వీసులో భాగంగానే 2011లో హెడ్ కానిస్టేబుల్ గా, 2014 సంవత్సరంలో ఏఎస్ఐగా, 2018 సంవత్సరంలో ఎస్సైగా అంచలంచలుగా పదోన్నతి పొంది ప్రస్తుతం భీంపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా 9 నెలల పాటు విధులను నిర్వర్తించి ఈరోజు పదవి విరమణ పొందడం జరుగుతుంది. తన సర్వీసులో ఎక్కువ కాలం ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లలో విధులను నిర్వర్తించి, శాంతి భద్రతల పరిరక్షణలో తన వంతు పాత్రను పోషించడం జరిగింది. ముఖ్యంగా తన సర్వీసులు మొత్తాన్ని ఎలాంటి రిమార్కులు లేకుండా పూర్తి చేసినందుకుగాను గుర్తించిన ప్రభుత్వం సేవ, ఉత్తమ సేవా పథకాలతో గౌరవించింది. తండ్రి బాటలోని కొడుకు మహమ్మద్ కలీం పోలీసు ఉద్యోగాన్ని సాధించి సేవలందించి ఈరోజు పదవీ విరమణ పొందడం గమనర్ధం. *తండ్రి మొహమ్మద్ ఉమర్* సిఐ స్థాయి వరకు ఎదిగి, విధులు నిర్వర్తించి గతంలో పదవి విరమణ పొందడం జరిగింది. రెండు తరాలుగా పోలీసు వ్యవస్థకు సేవలందించడం సంతోషకరం అని తెలియజేసిన కుటుంబ సభ్యులు మరియు ఎస్సై మోహమ్మద్ కలీం. చివరగా జిల్లా ఎస్పీ మరియు సిబ్బంది కరతాల ధ్వనుల నడుమ వాహనం వరకు వచ్చి సాధారంగా సాగనంపి, అభినందనలు తెలియజేసి వీడ్కోలు పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సీఐ జైనథ్ డి సాయినాథ్, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ గుణవంతురావ్, సి సి దుర్గం శ్రీనివాస్, సిబ్బంది కవిత జైస్వాల్, గిన్నెల సత్యనారాయణ, అనసూయ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments