హజ్ వెళ్లే యాత్రికులకు అవగాహన సదస్సు : పూర్తి విశ్వాసంతో నమ్మకంతో వెళ్లాలిఅదిలాబాద్ : అక్షరతెలంగాణ :
పవిత్ర హజ్ యాత్రలో నిర్ధిష్ట నియమాలు పాటిస్తూ ఆరాధన భావం కలిగి ఉంటేనే హజ్ పరిపూర్ణం అవుతుందని ప్రధాన శిక్షకుడు మౌలానా సయ్యద్ మజ్హర్ ఖాస్మీ సూచించారు.హజ్ యాత్ర సందర్భంగా పూర్తి నియమ నిబంధనలు పాటిస్తేనే అల్లాహ్ సంతుష్టుడౌతాడని సూచించారు. అత్యంత పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళామా? వచ్చామా? అని కాకుండా అల్లాపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతో వెళ్లాలన్నారు.అలాంటప్పుడే హజ్ యాత్ర సార్థకం అవుతుందని పేర్కొన్నారు.ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు నియమ నిబంధనల గురించి ఆయన గురువారం పట్టణంలోని సెంటర్ గార్డెన్ లో నిర్వహించిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్ అహ్మద్ తవక్కల్,ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఆఫీస్ ఉద్దీన్, జనరల్ సెక్రెటరీ ఎంఎ హసీబ్, కోశాధికారి జఫీ ఉల్లాఖాన్, మహమ్మద్ మోసిన్,అబ్దుల్ నసీం, ఫరూక్ అహ్మద్,నూర్ ఖాన్, నహీద్,మొహమ్మద్ అబ్దుల్ కలీం,హఫీజ్ మంజూర్ ఆహమ్మద్,తదితరులు పాల్గొన్నారు.
Comments