ఆదిలాబాద్: అక్షరతెలంగాణ :
...జాతీయ "నులి " పురుగు. ల దినోత్సవం ఫిబ్రవరి 10 ఈ దినోత్సవాన్ని విజయవంతం చేయాల నీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని
అంగన్వాడి కేంద్రాల్లోని పిల్లలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా వేసుకోవాలని అన్నారు. ఈ నెల 10 న నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్ములన దినోత్సవాన్ని 1 నుండి 19 సంవత్సరాలు కలిగిన పిల్లలు, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా ఈ నెల 17 న మోప్ అప్ డే నిర్వహించి తప్పిపోయిన పిల్లలకు తిరిగి ఆల్బెండ జోల్ మాత్రలు వేయడం జరుగుతుందన్నారు. అర్హులైన 1 నుండి 2 సంవత్సరాల వయసు గల పిల్లలకు ½ మాత్ర చూర్ణం చేసి చెంచాతో త్రాగించలని, 2 నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర అందించడం జరుగుతుందన్నారు. కావున 1-19 వయసు గలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని తెలిపారు. ఈ కార్యక్రమం పుర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు మండల, గ్రామ, వార్డు స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేసుకొని అర్హులైన పిల్లలకు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అభిగ్యన్ మల్వియా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, మెడికల్ ఆఫీసర్ లు, సంక్షేమ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments