కొండగట్టు అంజన్నకు బంగారు కిరీటం బహుకరించిన మహేశ్వర్ రెడ్డి ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామికి ఏ ఎం ఆర్. ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ కు చెందిన మహేశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా 350గ్రా బంగారు కిరీటం, 55 కేజీల వెండి మకర తోరణం, ఇతర అలంకరణ తొడుగులను బహుకరించారు. వీటి విలువ దాదాపు రూ. 1కోటి ఉంటుందని తెలిపారు. ముందుగా ఆభరణాలకు అర్చకులు సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం స్వామివారి మూలవిరాట్ కు కిరీటాన్ని తొడిగి, వెండి అలంకరణ తొడుగులను అమర్చారు.
Comments