ఆందోళనలో కార్మికుల కుటుంబాలు: ఆశలు వదులుకున్న అధికారులు :

Madupa Santhosh CEO
ఆందోళనలో కార్మికుల కుటుంబాలు: ఆశలు వదులుకున్న అధికారులు : శ్రీశైలం కాలువ టన్నెల్ లో కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నా, అధికారులు ఆశలు వదులుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. గల్లంతైన వారి గురించి సమాచారం కోసం కుటుంబాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.
మూడు  మీటర్ల మట్టిలోపల మృతదేహాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురు కార్మికులు. ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ఆక్వా ఐతో పాటు GPR సిస్టమ్ తో ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది.

మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను టన్నెల్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరో ముగ్గురి మృతదేహాలను కనుగొనేందుకు టీమ్ గాలిస్తోంది. మృతదేహాలను గుర్తించడంలో ఐఐటీ మద్రాస్ కు చెందిన నిపుణుల బృందం కీ రోల్ పోషించింది. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ఆధారంగా మృతదేహాలను గుర్తించారు. ప్రాణాలతో వస్తారనుకున్న వారి మృతదేహాలు బయటపడడంతో టన్నెల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments