ఏ ఐ ఆధారిత ఆన్లైన్ లెర్నింగ్ ప్రాసెస్ ను ప్రారంభించిన - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
   అదిలాబాద్ రూరల్ తాటిగూడ  ప్రభుత్వ  ప్రైమరీ స్కూల్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రోగ్రాం ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం వారు చదువులో ముందుండటానికి  వినూత్న కార్యక్రమాలు చేపటుతున్నదని అందులో భాగంగానే మొదట 6 జిల్లాల్లో ఏ ఐ  ఆధారిత ఆన్లైన్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రారంభించిందన్నారు.
అక్కడ విజయవంతం  కావటంతో మిగిలిన 27 జిల్లాల్లో  తేది 15 శనివారం. నుండి   నాలుగు ప్రైమరీ స్కూల్ లో ప్రారంభించారు..
3,4,5 తరగతుల విద్యార్ధుల అభ్యాస సామర్థ్యాలను బలోపేతం చేయుటకు 
ఈకే  స్టెప్ అనే ఆర్గనైజేషన్ తో కలిసి  ఏఎక్స్ఎల్అనే ఏ ఐ ఆధారిత వెబ్సైట్ ద్వారా విద్యార్ధులకు  బోధించడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్ధుల చదువుపట్ల అశ్రద్ధ చేయకుండా ప్రతీ రోజూ పాఠశాలలకు పంపించాలని ఆన్నారు.
ఏఐ  ద్వారా భాషలలో,గణితంలో వెనుకబడిన విద్యార్థులను తక్కువ సమయంలో సి గ్రేడ్ నుండి ఏ గ్రేడ్ కు మార్చవచ్చని ఏఐ  గురించి పేరెంట్స్ కు వివరించారు.
డి ఈ వో  ప్రణీత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ ,కోర్సు ట్రైనీ, ఎం ఈ వో  మనోహర్ , ఏ ఎస్ వో ,ట్రైనీ గణేష్ , తదితరులు పాల్గొన్నారు.
Comments