అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
మార్చి 21 వ తేదీ (శుక్రవారం) నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం మై ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయని,
పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయని ఆన్నారు.
9.35 కు విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు.
పదవ తరగతి పరీక్షలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందనీ పేర్కొన్నారు.
ఎటువంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా అత్యంత జాగ్రత్తగా ఈ పరీక్షలను నిర్వహించాలని, పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోను అనుమతి లేదని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ను కట్టుదిట్టంగా అమలు చేయడం జరిగిందని, సమీపంలో గల జిరాక్స్ సెంటర్ లను మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి, విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది, విద్యార్థులు ఎవరూ కూడా మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురకూడదని తెలిపారు.
పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.
విద్యార్ధుల సౌకర్యార్థం పరీక్షా సమయాలలో సకాలంలో బస్సులు నడపాలని ఆన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్, ఆన్ని సౌకర్యాలు కల్పించాలని ఆన్నారు.
Comments