Hyderabad: అక్షరతెలంగాణ :
వికలాంగులు, వయోవృద్ధులు & ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యములో డి-అడిక్షన్ సెంటర్ .ప్రారంభం.
దేశంలో మాదక ద్రవ్వ వ్యసనం వ్యాపిస్తున్నది. యువతలో ఇది వేగంగా విస్తరిస్తున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి సమాజంలో ఉన్న వివిధ ప్రభావాలు మరియు సామాజిక పరిస్థితులు యువతను మత్తు పదార్ధాల వైపు ఆకర్షిస్తున్నాయి
ఈ ఆందోళనకరమైన పరిస్థితి యువతలో ఆరోగ్య సమస్యలు, నేరాల రేటు పెరుగుదల మరియు విద్య, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిగత సంబంధాలను కోల్పోవడమే కాకుండా సమాజానికి కూడా తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది.
దేశంలోనే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం అనుగుణంగా, రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు వికలాంగులు, వయోవృద్ధులు & ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ "మిషన్ పరివర్తన" కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు, పునరావాస మరియు చికిత్సా సేవలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిరంతర పర్యవేక్షణ మరియు నిఘా వ్యవస్థలను అభివృద్ధి చేస్తూ, ఈ మహమ్మారి నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ "మిషన్ పరివర్తన కార్యక్రమం క్రింద తెలంగాణ రాష్ట్రములో నలుమూలల వివిధ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయబడింది.
ఈ సెల్ లో కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ మేనేజర్ లు మరియు ప్రోగ్రామ్ మేనేజర్లు నియమించబడ్డారు.
ఈ కార్యక్రమం ద్వారా యువత చెడు మార్గాలు పట్టకుండా, మాదక ద్రవ్వాల దుష్పరిణామాలపై యువతలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుటకు వివిధ శాఖల సమన్వయముతో అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
మాదకద్రవ్యాల వినియోగం యొక్క హానికరమైన పరిణామాలను నొక్కి చెప్పుటకు ఈ శాఖ కరపత్రాలు, బ్రోచర్లు, ఫ్లిప్ బుక్ రూపొందించినది.
వికలాంగులు, వయోవృద్ధులు & ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యములో ద్రాబాద్ అబ్జర్వేషన్ హోమ్ లో మాదకద్రవ్య వినియోగానికి గురైన పిల్లలు, అలాగే మాదకవ్య వినియోగానికి లోనయ్యే ప్రమాదంలో ఉన్న పిల్లలకు అవగాహన కార్యక్రమాలు, పునరావాస మరియు చికిత్సా సేవలను అందించుటకు డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయడమైనది.
తెలంగాణలో అబర్వేషన్ హోమ్ పిలల సంక్షేమం కోసం పపథమంగా ప్రభుత్వ నిర్వహిత డి- అడిక్షన్ సెంటర్ ప్రారంభం కావడం గర్వకారణం •
ఈ డి-అడిక్షన్ సెంటర్ వార్షిక నిర్వహణ కొరకు వికలాంగులు, వయోవృద్ధులు & ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాదికారత శాఖ ఇది వరకే రూ.13.80 లక్షలు మంజూరు చేసినది.
భవిష్యత్తులో ఈ సెంటర్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం నడపడానికి నిధులు మంజూరు చేస్తాము. డీ-అడిక్షన్ సెంటర్ ప్రత్యేక మానసిక నిపుణుల బృందం ద్వారా నిర్వహించబడుతుంది.
మాదక ద్రవ్యాలకు బానిసైన పిల్లల కుటుంబాలకు అవగాహన పెంచడం, పిల్లల పునరావాసంలో కీలక పాత్ర పోషించడానికి మార్గదర్శకతను అందిస్తారు.
త్వరలోనే ఈ డీ-అడిక్షన్ సెంటర్ లను అన్ని అబ్జర్వేషన్ హోమ్ లలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాము.
యువత మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా తమ లక్ష్యాలను సాధించడములో నిమగ్నమై మాదక ద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణములో భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క, అధికార యంత్రాంగం కోరారు.
Comments