మన ఆరోగ్యం: అక్షర తెలంగాణ :
ఇమ్యూనిటీని పెంచుకునేలా శరీరాన్ని మలుచుకొండి ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే... క్యాన్సర్ ఇక నీ దరికి చేరదు.
చాలా మంది క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి.
క్యాన్సర్ వ్యాధి సాధారణమైన ఈ రోజుల్లో.. దానిని నివారించడం ఓ కత్తి మీద సామే. కానీ మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ మహమ్మారి నుండి తప్పించుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లో చేసిన వంట" మాత్రమే తినాలి. ఈ మాట ఒక్క వాక్యంలోనే ఉంటుంది. కానీ ఆచరించటం పరగడుపున గుప్పెడు వేపాకు తిన్నంత కానీ ఆచరించితే మాత్రం క్యాన్సర్ దరిచేరకుండా ఉండాలంటే తప్పదు మరి. చక్కెర వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా బెల్లం, పటిక బెల్లం వంటివి వినియోగించాలి..జీవితంలో ఎప్పుడూ జబ్బు పడకుండా ఉండాలంటే చక్కెర మానేయాలి. ఒక టేబులు స్పూన్ చక్కెర గనుక మనం తీసుకుంటే అది రెండు గంటల్లో మన దేహం మొత్తం వ్యాపిస్తుంది. మానవ శరీరంలో జరిగే జీవక్రియల్లో అసమతూల్యాన్ని కలుగజేస్తుంది. శరీర అవయవాలన్నీ బలహీనమవుతాయి. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అల్సర్లు వస్తాయి. ఒక్క టేబుల్ స్పూన్ చక్కెర తోనే ఇన్ని అనర్థాలు ఉంటే ఐదారు టేబుల్ స్పూన్ల చక్కెర వినియోగించే ఒక కూల్ డ్రింక్ తాగితే శరీరం ఇంకెన్ని వ్యాధుల బారిన పడాలో అర్థం చేసుకోండి. చక్కెర కు బదులు పటిక బెల్లం, ముడి బెల్లం, తేనెను కూడా ఉపయోగించొచ్చు. ఖర్జూర పండ్లను ఎండపెట్టి పొడిగా చేసి వాడుకోవచ్చు.
మైదా పిండితో తయారయ్యే నూడిల్స్, బ్రెడ్, రస్క్ లు, సేమియా, కేకులు, బిస్కట్లకు దూరంగా ఉండాలి.
బొంబాయి రవ్వకు బదులు గోధుమ రవ్వ వాడాలి. జంక్ ఫుడ్ తినడం మానేయాలి.. మీరు ఇవన్నీ మానేస్తే క్యాన్సర్ కణం దానంతట అదే చస్తుంది.
40 సంవత్సరాల క్రితం మేము ఆచరించిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం అలవాటు చేసుకుని ఆచరించడానికి ప్రయత్నించండి.
ఏం తినవచ్చు ఏం తినకూడదు అని ఆలోచించక్కర్లేదు. పాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్,మైదాతో చేసిన ఆహారం,పంచదార, ఫ్రిజ్ లో ఆహారం పదే పదే వేడి చేసుకొని తినటం వంటివి పూర్తిగా వదిలేయండి. ఎక్కువగా మాంసాహారం తినవద్దు. అన్నం హ్యాపీ గా తినండి కానీ కూర ఎక్కువ తినండి, శరీరానికి కాస్త వ్యాయామం ఇవ్వండి. ఫోన్ మాయలో పడి మంచినీళ్లు త్రాగటం మర్చిపోకండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక విషయం అప్పటి జీవన విధానాన్ని ఆహారపు అలవాట్లను ఆచరించండి. మంచి నిద్ర ఆహారం తో పాటే ముఖ్యమయినది. ఏ వ్యాధి వస్తే ఏం తినాలి, ఏ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం తినకూడదు, అని రకరకాల సూచనలు పాటించకుండా ముందు మీ ఇమ్యూనిటీని పెంచుకునేలా శరీరాన్ని మలుచుకొండి ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే...
ఏసి వేసుకుంటే ఆరోగ్యం పాడవుతుందా నిజమా ....?ఏసి వేసుకోవద్దు అంటే ఎవరైనా అసలు ఏసి వేసుకోకుండా ఉండే పరిస్థితి ఉందా ..? చల్లధనాన్ని ఇచ్చే పరిస్థితులను మన చుట్టూరా నెలకొల్పాలి. అధిక సంఖ్యలో అంటే మొక్కలు నాటి వాటి పరిరక్షణ...చేయాలి.
గుండెపోటు తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక
మరణాలకు కారణవుతున్న మహమ్మారి... క్యాన్సర్.
ఔషధాలు, చికిత్స ఉన్నప్పటికీ, సకాలంలో
గుర్తించకపోతే క్యాన్సర్ ప్రాణాంతకమవుతుంది.
దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యం
- విడవని దగ్గు పలు కారణాలతో దగ్గు వస్తుంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు, ఆస్తమా, సీఓపీడీ, గ్యాస్ట్రోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) దగ్గుకు కారణమవుతాయి. అయితే అదేపనిగా దగ్గు వస్తుంటే అనుమానించాల్సిందే. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ కావొచ్చన్నది నిపుణుల మాట. ఇది పొడిదగ్గులా ప్రారంభమై, చివరికి దగ్గితే రక్తం పడే స్థాయికి చేరుతుంది.- పేగుల కదలికల్లో మార్పులు బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్ హెచ్ఎస్) ప్రకారం ఓ వ్యక్తికి పేగు క్యాన్సర్ సోకితే అనేక లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా మల విసర్జనకు వెళ్లాల్సి రావడం, మలం జారిపోతున్నట్టుగా వెలుపలికి రావడం, మలంలో రక్తం కనిపించడం వంటివి ఆ లక్షణాల్లో ముఖ్యమైనవి.
- గడ్డలు, వాపులు శరీరంలో అసాధారణరీతిలో వాపులు, గడ్డలు కనిపిస్తే దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. అన్ని రకాల గడ్డలు క్యాన్సర్ కాకపోవచ్చు కానీ... పెద్దగా, గట్టిగా, స్పర్శ లేనట్టుగా ఉండే గడ్డలు క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చని, ఉన్నట్టుండి వాపు కనిపించడం కూడా తేలిగ్గా తీసుకోరాదని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ కారక గడ్డలు నిదానంగా పెరుగుతూ, చర్మం బయటికి వేళ్లాడుతుంటాయి. ఇలాంటివి ఎక్కువగా రొమ్ములు, వృషణాలు, మెడ, చేతులు, కాళ్లలో ఏర్పడుతుంటాయి.
- పుట్టుమచ్చల్లో మార్పులు శరీరంపై పుట్టుమచ్చలు ఉండడం సహజం. అయితే ఆ పుట్టుమచ్చల్లో మార్పులు కనిపిస్తే శరీరంలో క్యాన్సర్ కణజాలం ఉందనడానికి సంకేతంగా అనుమానించాల్సి ఉంటుంది. పుట్టుమచ్చ పరిమాణం, రంగు మారితే మెలనోమాకు సంకేతం కావొచ్చు. మెలనోమా అంటే ఓ రకమైన చర్మపు క్యాన్సర్. చర్మం రంగు నిర్దేశించే పదార్థం మెలనిన్. ఈ మెలనిన్ ను ఉత్పత్తి చేసే కణాలు క్యాన్సర్ బారినపడితే దాన్ని మెలనోమా అంటారు.
- కారణం లేకుండా బరువు తగ్గడం క్యాన్సర్ సోకిన వ్యక్తులు ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండానే బరువు కోల్పోతుంటారు. క్యాన్సర్ తో బాధపడే వ్యక్తుల్లో కనిపించే తొలి లక్షణం ఇదేనట. ముఖ్యంగా, ఉదరం, పేంక్రియాస్, ఆహార వాహిక, ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకితే గణనీయంగా బరువు తగ్గిపోతారని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది.
- తగ్గని నొప్పులు సాధారణంగా ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు ఒళ్లు నొప్పులు సహజమే. అయితే ఎలాంటి పని చేయకుండానే నొప్పులు కలిగితే దాన్ని క్యాన్సర్ సంకేతంగా భావించవచ్చు. ఇలాంటి నొప్పులు వారాలు, నెలల తరబడి వేధిస్తుంటాయి. నీరసం, మంటలు పుడుతున్నట్టుగా నొప్పులు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదు.
- ఆహారం మింగడంలో ఇబ్బంది ఆహారం మింగేటప్పుడు అసౌకర్యం కలిగితే దాన్ని తేలిగ్గా తీసుకోరాదు. దీన్ని డిస్ఫేజియా అంటారు. క్యాన్సర్ రోగుల్లో మెడలో పెరిగే కణితి వల్ల ఈపరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల అన్నవాహిక కుచించుకుపోయి, మింగడం ఇబ్బందికరంగా మారుతుంది.
- మూత్రంలో రక్తం బ్లాడర్ కు కూడా క్యాన్సర్ సోకుతుందని తెలిసిందే. ఈ తరహా క్యాన్సర్ తో బాధపడేవారిలో మూత్రంలో రక్తం పడుతుంది. దీన్ని వైద్య పరిభాషలో హెమటూరియా అంటారు. ఇలా మూత్రంలో రక్తం పడేటప్పుడు ఎలాంటి నొప్పి ఉండకపోవచ్చని, కానీ మూత్రంలో రక్తం పడడం బ్లాడర్ క్యాన్సర్ కు సంకేతంగా భావించవచ్చని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ చెబుతోంది. ఇక, ప్రోస్టేట్ క్యాన్సర్ బాధితుల్లోనూ ఇలా మూత్రంలో రక్తం పడడం గుర్తించినట్టు బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ప్రోస్టేట్ గ్రంథి నుంచి రక్తస్రావం కారణంగా ఇలా జరుగుతుంది.
Comments