గంజాయి పై ఉక్కు పాదం - కఠిన చర్యలు - ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి

Madupa Santhosh CEO
గంజాయి పై ఉక్కు పాదం - కఠిన చర్యలు - ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి
Adilabad: అక్షరతెలంగాణ 
 - అదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదుగురిపై కేసు నమోదు, అరెస్ట్.
- 35 గ్రాముల గంజాయి, ఐదు మొబైల్ ఫోన్లో స్వాధీనం. 
 - ఇద్దరు గంజాయి అమ్మేవారు, ఒక పండించేవాడు, ఇద్దరు సేవించేవారు పై కేసు నమోదు అరెస్టు.

 - తల్లిదండ్రుల. తమ పిల్లల పట్ల (విద్యార్థుల)  కదలికలపై దృష్టి సారించాలి.

యువత గంజాయి మత్తు బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఐదుగురిపై కేసు నమోదు చేయబడిందని అందులో ఇద్దరు గంజాయి అమ్మేవారు, ఒక గంజాయి ని పండించేవాడు, ఇద్దరు గంజాయి సేవించేవారు ఉన్నారని తెలిపారు. వీరి వద్దనుండి 35 గ్రాముల గంజాయి, 5 మొబైల్ ఫోన్లో స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. గంజాయి అమ్మిన సేవించిన చట్టప్రకారం నేరమని ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ గంజాయిని ఆదిలాబాద్ జిల్లా లో రూపుమాపాలనే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం క్రిత నిశ్చయంతో పనిచేస్తుందని తెలిపారు. గంజాయిని అమ్మిన, పండించిన, రవాణా చేసిన, కలిగి ఉన్న, సేవించిన ప్రతి ఒక్కరు చట్టం దృష్టిలో నేరస్థులే అని తెలిపారు. *అరెస్ట్ అయిన నిందితుల వివరాలు* 
A1) కృష్ణ పల్లి వంశీ s/o వెంకటేష్, కొత్తపేట గ్రామం, ఎండపల్లి మండల్, జగిత్యాల జిల్లా. (గంజాయి వ్యాపారస్తుడు.)
A2) కృష్ణ పల్లి మల్లేష్ s/o రాజయ్య,కొత్తపేట గ్రామం, ఎండపల్లి మండల్, జగిత్యాల జిల్లా. (గంజాయి వ్యాపారస్తుడు.)
A3) కుమురు మహదు s/o పక్రూ, లింగుగూడ గ్రామం ఆదిలాబాద్ రూరల్ మండలం. (గంజాయి పండించే వ్యక్తి)
A4) తుల్జాపూరి అజయ్, శాంతినగర్ ఆదిలాబాద్. 
A5) అలాల్ తిరుమలేష్ , శాంతినగర్ ఆదిలాబాద్. 
(గంజాయి సేవించే వ్యక్తి) 
వీరిపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని A1,A2,A3 లను అరెస్టు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఒకటవ పట్టణ సీఐ సునీల్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐ అశోక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments