మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ప్రత్యేక నిఘా - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్:

Madupa Santhosh CEO
మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ప్రత్యేక నిఘా - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్: 
Adilabad: అక్షరతెలంగాణ : 

 - సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్.

 సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు
 - ప్రజలు సంయమనం పాటించాలి, ఎలాంటి సందేహాల కైనా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలి.

- అత్యవసర సమయాలలో డయల్ - 100 ను వినియోగించుకోవాలి. 
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని సమయమనం పాటిస్తూ ఉండాలని, ఎలాంటి సందేహాల కైనా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు. అర్థరహితంగా మరియు ఇతర వర్గాలను కించపరిచేలా  వాట్సాప్ ల ద్వారా గాని, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లలో సోషల్ మీడియాలో పోస్టులను చేసిన వారిపై కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు అప్రమత్తంగా ఉంటూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారి ని కనుగొని వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు ఎలాంటి సమాచారానైనా జిల్లా పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలని అత్యవసర సమయాలలో డయల్ - 100 వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసు యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణను చేపడుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
Comments