వారంలో ఒకరోజు ఫ్యామిలీ , బందువులు. వీలైతే మిత్రులతో సరదాగా..రుచికరమైన వంటలు తినాలి అనిపిస్తే రెస్టారెంట్ , హోటల్ల కి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన పరిసరాల లో చేస్తున్నారో తెలుసా..? నిల్వ చేసిన మాంసాన్ని ,చేపలను , కుళ్లిపోయిన గుడ్లను వండి పెడుతున్నారో గమనించారా..? ఆలోచించండి ..? హోటల్ కి వెళ్లాలంటేనే జడుసుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం హోటళ్లలో మున్సిపాలిటీ ఆ హార పదార్థాల తనిఖీ అధికారులు చేసిన తనిఖీ ల లో కండ్లు బైర్లు కమ్మాయి. బొద్దింకలు,ఎలుకలు, దుర్వాసన, బూజుపట్టిన మసాలాలు, అశుభ్రమైన వంటసామాగ్రి, వెజ్, నాన్వేజ్ కు ఓకే పాత్రలను ఉపయోగిస్తున్నారు.
ఆదిలాబాద్ పట్టణం లో పలు హోటళ్లు, స్వీట్ షాపులపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మామ్స్ కిచెన్ హోటల్లో తనిఖీల్లో కుళ్లిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి. కుళ్లిపోయిన మాంసంతో పాటు వాటిని నిల్వ ఉంచే ఫ్రిడ్జ్ ల్లో పురుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దశ్నాపూర్
మామ్స్ కిచెన్ లో కుళ్లిన మాంసం నిల్వలు ఉన్నట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్లు, హోటల్లో కుళ్లిన మాంసాన్ని వండి పెడుతున్నారని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం ఆదిలాబాద్ మున్సిపల్ శానిటరీ అధికారులు దస్నాపూర్ లోని మామ్స్ కిచెన్ రెస్టారెంట్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.మామ్స్ కిచెన్ లో ఫ్రీజర్ లలో ఉన్న మాంసపు నిల్వలను శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లెపూల నరేందర్ పరిశీలించారు. పెద్ద మొత్తంలో మటన్, చికెన్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అవి దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, కుడిన మాంసాలను ఫ్రై చేసి వండి పెడుతున్నారని మండిపడ్డారు. అలాగే రైతు బజార్ సమీపంలోని వెంకటేశ్వర స్వీట్ హోమ్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు బూజు పట్టిన స్వీట్ పదార్థాలు ఉన్నట్లు గుర్తించి స్వీట్ హోమ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారుల తనిఖీలపై అనుమానాలు.తావువిస్తున్నాయి.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయని, ప్రతి దాంట్లో నిల్వ ఉంచిన మాంసాన్ని ప్రజలకు వండి పెడుతూ నిర్వాహకులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ హోటళ్లలో, రెస్టారెంట్లలో తరచూ ఈ విధమైన నిల్వ ఉంచిన మాంసంను, చేపలను, రాత్రి. మిగిలిన. వాటిని మరుసటి రోజు నూనెలో వేపి.వండి పెడుతారు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు పట్టించుకోవడంలేదని, వారి నిర్లక్ష్యం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో పడి తూతూ మంత్రంగా తనిఖీలు చేయడం వల్లనే హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిళ్లకముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments