అదిలాబాద్ అక్షరతెలంగాణ :
ఉగాది లేదా యుగాది అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర దినం. ఈ పండుగను దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవాలో జరుపుకుంటారు. ఉగాది అంటే సంవత్సరారంభం అని అర్థం. ఈ పండుగ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ రోజే బ్రహ్మ దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడని నమ్ముతారు. ఈ ఏడాది మార్చి 30 వ తేదీన ఉగాది పండుగను జరుపుకుంటామని
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి ప్రజలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు
జిల్లా ప్రజలందరికి ఈ నూతన సంవత్సరం బాగా కలిసి రావాలని కోరుకుంటూ తీపి, చేదు కలగలిపినదే జీవితం. కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం.. ఆ జీవితంలో ఆనందోత్సావాలని పూయించేందుకు వచ్చిందే ఉగాది.
తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు కారంతో తయారు చేసిన ఉగాది పచ్చడిలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలన్నింటికీ ఉగాది పచ్చడి ప్రతీక అని అన్నారు. ప్రజలందరూ సుఖ, సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
Comments