తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ - వెనకబడిన తగతులకు.....?

Madupa Santhosh CEO
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ . వెనుకబడిన తరగతులను...? 
Hyderabad: అక్షరతెలంగాణ : 
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ - 3,04,965 కోట్లు 
1.రెవెన్యూ వ్యయం - 2,26,982 కోట్లు
2.మూలధన వ్యయం - 36,504 కోట్లు
3.రైతు భరోసా కోసం - 18వేల కోట్లు
4.వ్యవసాయ శాఖ - 24,439 కోట్లు
5.పశు సంవర్డక శాఖ - 1,674
6.సివిల్ సప్లై - 5,734 కోట్లు
7.విద్యా శాఖ - 23,108 కోట్లు
8.కార్మిక ఉపాధి కల్పన - 900 కోట్లు
9.పంచాయతీ రాజ్ శాఖ - 31,605 కోట్లు
10.మహిళా శిశు సంక్షేమ శాఖ - 2862 కోట్లు

 వెనుకబడిన తరగతులను వెనుకకు నెట్టివేసే బడ్జెట్
ఇది దొరల పాలన మరొకసారి రుజువు చేయబడ్డది.
ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన కానే కాదు.

46.25% గా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేవలం 3.74% (రూ. 11,405 కోట్లు) మాత్రమే కేటాయించారు.
17.43% ఉన్న ఎస్సీలకు 13.19% (రూ. 40,232 కోట్లు) కేటాయించారు.
10.45% ఉన్న ఎస్టీలకు 5.63% (రూ. 17,169 కోట్లు) కేటాయించారు.
14% ఉన్న మైనార్టీలకు 1.18% కేవలం రూ. 3,591 కోట్లు మాత్రమే కేటాయించారు.

దీని ద్వారా బీసీలకు తీవ్ర అన్యాయం చేకూర్చినట్లే అవుతుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు:
కుల గణన జరుపుతామని,
42% బీసీలకు విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, కాంట్రాక్టు రంగాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని,
ప్రతి బడ్జెట్‌లో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి, సంవత్సరానికి రూ. 20,000 కోట్లు, ఐదు సంవత్సరాలకు మొత్తంగా రూ. 1 లక్ష కోట్లు బీసీల అభివృద్ధి మరియు సంక్షేమానికి కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత:
గత సంవత్సరం బడ్జెట్‌లో బీసీలకు రూ. 9,000 కోట్లు,
ప్రస్తుతం రూ. 11,000 కోట్లు మాత్రమే కేటాయించింది.ఇది బీసీలను ఆర్థికంగా వెనుకకు నెట్టివేయడమే అవుతుంది. రూ. 3 లక్షల 5 వేల కోట్ల బడ్జెట్ పన్నుల ద్వారా తయారైనప్పుడు, రాష్ట్రంలో సగం జనాభా బీసీలైతే, అందులో సగం వాటా బీసీలది కావాలి కదా? మరి ఎన్నికల్లో వాగ్దానం చేసి, రాజ్యాంగబద్ధంగా పన్నుల రూపంలో సగం వాటా కలిగిన బీసీలకు మొండి చెయ్యి చూపడం అంటే బీసీలకు అన్యాయం చేసినట్లే కదా?
అసమగ్ర కుల గణన సర్వేతో బీసీల సమగ్ర అభివృద్ధి జరగదని ఒకవైపు గగ్గోలు పెడుతుంటే, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రికి కుల గణన, 42% రిజర్వేషన్ల విషయంలో ధన్యవాదాలు తెలిపే నాయకులు, ఈ బడ్జెట్ కేటాయింపులకు ఏం సమాధానం చెబుతారు?
అసమగ్ర కుల గణన సర్వేను సమర్థించుకుంటూ, బీసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండమని చెబుతున్నారా?
బడ్జెట్ కేటాయింపులు ఎందుకు చేయించలేకపోతున్నారు? ఎందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు?

పునరాలోచన అవసరం:
ప్రతి బడ్జెట్‌లో, ప్రతి ప్రభుత్వంలో బీసీలకు అన్ని రంగాల్లో దక్కవలసిన వాటా దక్కకుండా పోతూనే ఉంది. అయినా, బీసీలు అన్ని రాజకీయ పార్టీలలో మెజారిటీ సభ్యులుగా ఉంటూ, ఆ పార్టీలను బతికిస్తూ, నాయకులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపిస్తూ, వారికి అధికారాన్ని కట్టబెడుతున్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన బలాలను కల్పిస్తూ, వారి అక్రమాలకు కూడా అండగా నిలుస్తున్నారు. కానీ, తమకే రక్షణ లేకుండా, అభివృద్ధి అందకుండా నెట్టివేయబడుతున్న వారికి ఈ సేవలు అందించడం ఎంతవరకు సమంజసం?

సగానికి పైగా జనాభా ఉన్న బీసీలు రాజ్యాధికారాన్ని అందుకోలేకపోవడం ఒక లోపం.
అందుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేయలేకపోవడం మరో లోపం.
రాజ్యాధికారం అందకుండా అడ్డుపడే శక్తులకే రక్షణ కవచంగా, అంగరక్షకులుగా మారడం శత్రు భావజాలాన్ని బలపరచడమే అవుతుంది.

బీసీ ల కంటే సామాజికంగా వెనుకబడిన ఎస్సీ సోదరులు రాజకీయంగా చైతన్యమై, రాజ్యాంగబద్ధంగా తమ వాటాను సాధించుకుంటున్నారు. జనాభా దామాషా పద్ధతిలో ఎస్సీ, ఎస్టీలకు వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు వాటా దక్కుతోంది. బడ్జెట్‌లో కూడా దాదాపు వారికి తగిన వాటా లభిస్తోంది. వారిని స్ఫూర్తిగా తీసుకొని, మన వాటా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.

బీసీ లని వంచనకు గురి చేస్తున్న సామాజిక శక్తుల చెంత చేరి డిమాండ్లు నెరవేర్చుకోవడం బానిసత్వంలో ఉండడమే. ఇటీవల కాలంలో కొంతమంది బీసీ వాదంతో ముందుకొచ్చి నఢి చౌరస్తాలో వాదాన్ని నిలబెట్టి నాలుగు పార్టీలతో చర్చలు జరుపుతూ సొంత అభివృద్ధికి ఏది మేలు చేస్తుందో దాని వైపు మళ్లడం మరో మోసపూరిత విధానం. సగానికి పైగా ఓటర్లు ఉన్న బీసీ సమాజం రాజకీయ పార్టీ ద్వారా చైతన్యం చేసుకొని ముందుకెళ్లే సాహసం కనిపించకపోతే, ఇది చారిత్రక మోసంగానే మిగిలిపోతుంది.
 ఓటు చైతన్యంతో హక్కులను సాధించుకునే వరకు, రాజ్యాధికార సాధన దిశగా అడుగులు వేసే శక్తిని మన వర్గాలకు అందించే వరకు నిర్విరామంగా కృషి చేయాలి. మనకంటూ రాజకీయ పార్టీని అభివృద్ధి చేసుకోలేకపోతే, అధికారాన్ని అందుకోలేకపోతే, ఈ అన్యాయం చవిచూస్తూనే ఉంటాం. ఆత్మపరిశీలన చేసుకొని, రాజ్యాధికార దిశగా అడుగులు వేద్దాం, ముందుకు నడుద్దాం. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది.
.....
Comments