ఆ తహసీల్దార్‌ కార్యాలయం లోకి మీడియాకు నో ఎంట్రీ..?

Madupa Santhosh CEO
SNR : ఆ తహసీల్దార్‌ కార్యాలయం లోకి  మీడియాకు నో ఎంట్రీ..?సంగారెడ్డి: అక్షరతెలంగాణ : 
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మీడియాకు నో ఎంట్రీ అంటూ అధికారులు పోస్టర్లు అతికించడం చర్చనీయాంశమైంది. ఈ విషయం విలేకరులకు తెలియడంతో వివాదం చెలరేగింది. ఈ విషయమై విలేకరులు వెంటనే తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకోగానే అక్కడి సిబ్బంది వాటిని వెంటనే తొలగించారు.
-ఎందుకోసం ఇలా పోస్టర్లను అతికించారని ప్రశ్నించాలని విలేకరులు తహసీల్దార్‌ ఛాంబర్‌లోకి వెళ్లగా.. ఇది గమనించిన తహసీల్దార్‌ నజీమ్‌ఖాన్‌ కార్యాలయం పక్కనే ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విలేకరులను పిలిపించాలని ఎస్సై విజయ్‌కుమార్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ ఆఫీసులో ఉన్న విలేకరులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తాము పోస్టర్లను ఎందుకోసం అతికించారని అడిగేందుకు కార్యాలయానికి వెళ్లామని విలేకరులు ఎస్ఐకు సృష్టం చేశారు.
కాగా మీడియాను కట్టడి చేసేందుకు తహసీల్దార్‌ ప్రయత్నిస్తున్నారని.. స్థానిక విలేకరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియాపై విషం వెల్లగక్కిన తహసీల్దార్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక విలేకరులు డిమాండ్‌ చేస్తున్నారు.
Comments