గవర్నర్ దత్తత గ్రామం బుర్కి నీ సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటిడిఎ పిఓ.

Madupa Santhosh CEO
గవర్నర్ దత్తత  గ్రామం  బుర్కి నీ సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటిడిఎ పిఓ.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
గవర్నర్ దత్తత తీసుకున్న బుర్కి గ్రామాన్ని సందర్శించి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామస్తులకు దుప్పట్లు, విద్యార్ధులకు యూనిఫాం లను అందజేసిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా,  ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బూ గుప్తా.

అదిలాబాద్ రూరల్ బుర్కి గ్రామాన్ని  బుధవారం జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఓ సందర్శించారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన వాహనం లో బుర్కి గ్రామానికి చేరుకున్నారు.
గ్రామస్తులు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమం లో ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ, డి డబ్లూ, వో ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, ఫారెస్ట్, ఆర్ డబ్లూ ఎస్, వ్యవసాయ శాఖ ఏ వో, వివిధ ఆయా శాఖల అధికారులు, ఎంపిడిఒ, ఎం పి వో, తదితరులు గ్రామం లో చేపట్టిన అభివృద్ధి పనుల తీరును కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ఆన్ని మౌలిక వసతులు, అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, ఈ గ్రామం లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని, అంగన్వాడి భవనం, కమ్యూనిటీ హాల్ నూతనంగా నిర్మించడం జరిగిందన్నారు.
రహదారి నిర్మాణానికి  అంకోలీ నుండి భుర్కి గ్రామానికి 6 కిలో మీటర్లు ఉంటుందని, రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, ముందుగా రెవెన్యు కు సంబంధించి 1.6 కిలో మీటర్లు బి టి.  రోడ్డు నిర్మాణం, తదుపరి అటవీ శాఖ అనుమతుల తో మిగితా. రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ నిర్మాణ పనులు మార్చి చివరి లోగా పూర్తి చేయాలనీ ఈ ఈ  ట్రైబల్ వెల్ఫేర్ ను ఆదేశించారు.

ఓపెన్ వెల్ కు రిటర్నింగ్ వాల్ ఏప్రిల్ 7th వరకు పూర్తి చేయనీ వాల్లను ఆర్ డబ్లు ఎస్ ను ఆదేశించారు.
అలాగే సోలార్ ద్వార నీటి సదుపాయం కల్పించడానికి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రెడ్ సి సంస్థ ముందుకు వచ్చిందని అన్నారు.
ఐటిడిఏ ద్వారా 20 మందికి డీజిల్ ఇంజన్, స్ప్లింకర్లు, ట్రాక్టర్, క్రషర్ ఏర్పాటు చేయడం జరుగుతుందనీ ఐటిడిఎ పిఓ తెలిపారు.
అంగన్వాడి ద్వారా పోషకాహారం అందించడం జరుగుతున్నదని, అంగన్వాడి టీచర్, సిఆర్ టి. వి ధులకు హాజరు కావాలని తెలిపారు.
మారుమూల  గిరిజనులు నివాసమైన బుర్కి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకొని  ప్రణాళిక ప్రకారం  గిరిజనులకు పోషకమైన ఆహారాన్ని అందించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) సభ్యులు పనిచేస్తున్నారని, వీరి ఆద్వర్యం లో దుప్పట్లు, యూనిఫాం గ్రామస్తులకు, విద్యార్థులకు కలెక్టర్, ఐటిడిఏ పీవో చేతుల మీదుగా అందించారు.
అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు శాతాన్ని, పౌష్టికాహారం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద సోనేరావు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.
Comments