కేశ్లా పూర్ నాగోబా ఆలయాన్ని దర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని దర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
ఆదిలాబాద్ : అక్షరతెలంగాణ : 
 - అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించాలి - జిల్లా ఎస్పీ.
-   ఇంద్రవెల్లి, ఉట్నూర్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ.
 - ప్రజలతో, ఆదివాసీలతో మమేకమై విధులను నిర్వర్తించాలి.
 - పోలీస్ స్టేషన్ రికార్డులను, సిబ్బంది విధులను పరిశీలించిన జిల్లా ఎస్పీ.
ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. మేస్రం వంశీయుల ఆచారాలను, ఆలయ చరిత్రను, ఆలయ పరిసరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా  పోలీస్ స్టేషన్ల అధికారులు జిల్లా ఎస్పీకి పూల మొక్క అందజేసి స్వాగతం పలికి, సిబ్బంది ని పరిచయం చేశారు.  పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న చిల్డ్రన్ పార్కులను పోలీసు కుటుంబ సభ్యులు పిల్లలు వినియోగించుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నమోదు కాకుండా చూడాలన్నారు. ప్రజలకు  సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, గంజాయి వల్ల కలిగే అనర్ధాల పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ చైతన్య పరచాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల రోడ్డు ప్రమాదాలను నివారించడానికి యువతకు కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డుపై తీసుకునే జాగ్రత్తలను వివరించాలని, ప్రతిరోజు సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. గంజాయి పండించడం, సేవించడం, కలిగి ఉండడం, వ్యాపారం చేయడం చట్టరీత్యా నేరమని, అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఆదివాసీలతో ప్రతిరోజు మమేకమైతు గ్రామాలను సందర్శిస్తూ విధులను నిర్వర్తించాలని సూచించారు.   పోలీస్ స్టేషన్లో ఉన్న అనవసర వాహనాలను చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్, ఉట్నూర్ సిఐ జి మొగిలి, ఎస్సైలు డి సునీల్, మనోహర్, పి ఎస్ ఐ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments