ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుండి అర్హులైన ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న సదుద్దేశంతో ప్రజా పంపిణీ ద్వారా ప్రతి నెల సన్నబియ్యం సరఫరా చేస్తారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఈ సన్నబియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో 32వ షాప్ నంబర్ లో సన్నబియ్యం కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న సదుద్దేశంతో ప్రజా పంపిణీ ద్వారా ప్రతి నెల దొడ్డు బియ్యం కు బదులుగా ఆరు కిలోల సన్నబియ్యం అందజేయడం జరుగుతుందని తెలిపారు.
- ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. సన్న బియ్యంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. అటు మావలలో సన్న బియ్యం పంపిణీ నీ మావల మండల అధ్యక్షుడు ధర్మపురి శేఖర్ ఆధ్వర్యంలో రేషన్ షాప్. నెం: 7 నందు సన్నబియ్యం ప్రారంభం చెసారు .రేషన్ కార్డు లబ్ధిదారులు సన్న బియ్యం పంపిణీ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తామని కేవలం హామీలతో సరిపెట్టిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని మండల అధ్యక్షుడు పేర్కొన్నారు. కార్యక్రమం లో సంబంధిత అధికారులు ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, రేషన్ డీలర్లు, రేషన్ అర్హులు, తదితరులు పాల్గొన్నారు.
Comments