బెట్టింగ్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
- బెట్టింగ్ పై ఉక్కు పాదం ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇద్దరి పై బెట్టింగ్ కేసు నమోదు.
-బెట్టింగ్ నిర్వహించిన, పాల్పడిన, బెట్టింగ్ యాప్స్ తో ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు.
యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, ఐ పి ఎల్ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ మంగళవారం ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో తెలిపారు.
Cr.No. 139/2025 U/Sec. టి ఎస్ గేమింగ్ చట్టం యొక్క 9(1) నిన్న అంటే 31.03.2025 నాడు 18.35 గంటలకు I(S. అశోక్) HC-2195, PC-3147తో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఆదిలాబాద్‌లోని DIET గ్రౌండ్‌లో కొందరు వ్యక్తులు ఆన్‌లైన్ (CRICBET99 యాప్) IPL బెట్టింగ్ ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే నేను HC &PC తో కలిసి ఆదిలాబాద్‌లోని DIETకి పరుగెత్తగా, ఒకరు జోగు సాయికుమార్, S/o: పోచన్న, వయస్సు: 24 సంవత్సరాలు, కులం: మూనూరు కాపు, Occ: బైక్ మెకానిక్, R/o. కచ్చకంటి గ్రామం, ఆదిలాబాద్. ఓపెన్ ప్లేస్ డైట్ గ్రౌండ్ ఏరియాలో 18.45 గంటలకు ఆన్‌లైన్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో A2, A-1 అని ఒప్పుకున్నాడు. షేక్ సజీద్ S/o: షేక్ హనీఫ్, వయస్సు: 24 సంవత్సరాలు, కులం: ముస్లిం, Occ: బైక్ మెకానిక్, R/o. రామై విలేజ్, ఆదిలాబాద్ కమిషన్ నేరం చేసి తన నేరాన్ని అంగీకరించాడు. మరియు A1 ఫోన్‌ను పరిశీలించగా, అతను ఆన్‌లైన్ బెట్టింగ్ CRICBET99 యాప్‌లో నమోదు చేసుకున్నట్లు మరియు A2 నుండి డబ్బు తీసుకుంటున్నట్లు కనుగొనబడింది. ఈ మేరకు ఈరోజు అతడిని అరెస్టు చేశారు. వెంటనే నేను A1 మరియు A2 నిందితుల ఒప్పుకోలు మరియు స్వాధీనం పంచనామాను నమోదు చేసాను. అనంతరం వీరి వద్దనుండి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు
తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యువత, ప్రజలు విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ లకు బానిసలుగా మారి, అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని, ఆన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, ప్లే కార్డ్, గేమ్స్ కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
అలాగే IPL క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత ఆర్థికంగా దెబ్బతిని చివరికి సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, బెట్టింగ్ లకు యువత దూరంగా ఉండాలని తెలిపారు.
IPL బెట్టింగ్ నిర్వహించే వారిపై పోలీస్ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల పై ప్రవర్తన పై నిఘా పెట్టాలని, ప్రతి రోజూ పిల్లలు వారు చేస్తున్న పనుల గురించి ఆరా తీయాలని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్, ప్లేయింగ్ కార్డ్స్, బెట్టింగ్ యాప్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బెట్టింగ్ ప్రోత్సహించిన, నిర్వహించిన, బెట్టింగ్ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల నిర్వహకుల మార్గదర్శకంలోనే బెట్టింగ్ లు ఆపరేట్ చేయబడతాయని, బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనీ, ఎస్పీ గారు సూచించారు. బెట్టింగ్ యాప్ ల డౌన్ లోడ్ ద్వారా ప్రజల వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వివరాలు, సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళే అవకాశం ఉన్నందని పేర్కొన్నారు.
జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి, బెట్టింగ్ సంబంధిత సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, ఇన్ఫర్మేషన్ అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐ బి సునీల్ కుమార్, కరుణాకర్, ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments