ADB : కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయాల సాధన కోసం కృషి చేయాలి: జిల్లా అధ్యక్షులు సాయి కుమార్
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
ప్రగతిశీల విద్యార్థుల ప్రియనేత కామ్రేడ్ జార్జి రెడ్డి స్పూర్తితో సాగుదాం. పి డి ఎస్ యు.
అదిలాబాద్ నగరంలో కొమరం భీమ్ భవన్ లో పి డి ఎస్ యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా పి డి ఎస్ యూ అధ్యక్షులు సిడం సాయికుమార్ మాట్లాడుతూ
ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొంటామని తెలియజేశారు జార్జ్ బతికుంటే తమ దౌర్జన్యాలు అవకాశవాధాలు సాగవని మనువాదులు పన్నాగం పన్ని కత్తులతో దాడి చేసి హతమార్చిన నాటి నుండి నేటి వరకు ప్రగతిశీల గొంతులు జార్జి ఆశయాన్ని నినదిస్తూనే ఉన్నాయని వారు తెలిపారు. ఏ ఉన్మాద శక్తులైతే జార్జ్ ని దాడి చేసి చంపరే ఆ భావాజాలమే అధికార పగ్గాలను పట్టుకొని హింసాయుత పరిపాలన కొనసాగిస్తుంది. నేడు దేశంలో మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం మతోన్మాద, మనువాద రాజ్య స్థాపన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదన్నారు. మోడీ విధానాలు దేశ లౌకిక వ్యవస్థకు, భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తికి పెను ప్రమాదకరంగా మార్చుతూ
మత ప్రయోగశాలలుగా మార్చేందుకు, నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చి, విద్యారంగాన్ని పూర్తిగా కాషాయకరించే కుట్రపూరిత చర్యలకు ఒడిగట్టిందని వారు విమర్శించారు. స్కిల్ ఇండియా పేరుతో విద్యార్థులను మోసం చేసేందుకు విద్యారంగాన్ని ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కొల్లగొట్టేందుకు పార్లమెట్ ను సైతం దిక్కరించి యూనివర్సిటీల నూతన ముసాయిదాను ఆమోదించే ప్రక్రియను కొనసాగిస్తున్న తరుణంలో జార్జ్ స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మడవి రవి కిరణ్ నాయకులు సాయికిరణ్ ఆకాష్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు
Comments