ADB: గ్యాస్ కట్టర్: కరడుగట్టిన దొంగల ముఠా అరెస్ట్ : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.Adilabad: అక్షరతెలంగాణ :
- బ్యాంకు దొంగతనానికి విఫలయత్నం చేసిన దొంగల ముఠా నుండి ముగ్గరు దొంగల అరెస్ట్, ముగ్గురు పరారి , ముగ్గురు ప్రస్తుతము జైల్లో అరెస్ట్ ఐ ఉన్నారు.
- ప్రజల మధ్యలో ఉంటూ ఎన్నో నేరాలకు పాల్పడుతూ బ్యాంకుకు కన్నం వేసే ప్రయత్నం చేసిన పాత నేరస్తులను, చాకచక్యంగా దొంగలను పట్టుకున్న సిసిఎస్ మరియు రూరల్ పోలీస్ సిబ్బంది.
అదిలాబాద్ జిల్లా స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ కాలనీలకు సంబంధించి ఒక ముఠా గా ఏర్పడి జల్సాలకు అలవాటుపడి పలువురు యువకులు నేరాలకు పాల్పడుతూ జల్సాలకు తిరుగుతూ డిసెంబర్ 12 వ తారీఖున ఆదిలాబాద్ గ్రామీణ మండలం రామాయి గ్రామంలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకు కు కన్నం వేసి లోపలి ప్రవేశించి బ్యాంకులో అమర్చిన మోషన్ డిటెక్షన్ అలారాం
సైరన్ రావడంతో దొంగాతనo విఫలమై, పారిపోవడం జరిగింది. ఈ కేసు నందు మొత్తం 9 మంది దొంగలు నేరానికి పాల్పడగా, అందులో ముగ్గురు వ్యక్తులు ఈరోజు ఆదిలాబాద్ గ్రామీణ మండలం కచకంటి గ్రామ శివారులో పోలీసులకు అనుమానాస్పదం గ కనిపించగా పోలీసులు పట్టుకోగా నేరం అంగీకరించారు మరియు వారి వద్ద నుండి బ్యాంకు దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, గడ్డపార స్వాధీనపరచుకోనైనది. నిందితులలో
A1) చవాన్ రవి (కీలక సూత్రధారి, సుపరి మర్డర్ కేసులో నిందితుడు), ప్రస్తుతం వేరే కేసు నందు అరెస్టై జైల్లో ఉన్నాడు. ఇతను గతం లో మావల పోలీస్ స్టేషన్ లో రఘుపతి తో పాటు ఒక హత్య యత్నం కేసు లో జైలు కి వెళ్ళినాడు మరియు జిల్లాల పోలీస్ స్టేషన్ల లో దొంగతనం కేసులలో జైలు కి వెళ్ళినాడు.
A2) సన్నీ ( సుక్దేవ్) సన్నీ, ప్రస్తుతం వేరే కేసు నందు అరెస్టై జైల్లో ఉన్నాడు. (ఇతను కూడా ఎన్నో నేరాలలో జైలుకు వెళ్లి వచ్చినాడు )
A3) పుష్ప - పవన్ (పరారి)
A4) గోవిందుడు కార్తీక్ (గోల్డెన్ కార్తీక్), ప్రస్తుతం 2 టౌన్ లో మర్డర్ కేసు నందు అరెస్టై జైల్లో ఉన్నాడు. (ఇతని పై రౌడీ షీట్ ఉంది )
A5) దగడ్ సాయి @ సెంబేటి సాయికుమార్ @ కుంచాల సాయి కుమార్ s/o రత్తాలు , వయస్సు: 24 సం. కులం: మున్నురుకపు నివాసము భుక్తపూర్ (అరెస్ట్) (ఇతను కూడా ఎన్నో కేసులలో అరిస్ట్ ఐ జైలుకు వెళ్లి వచ్చినాడు )
A6) మణికంఠ (పరారీ)
A7) జాదవ్ రాజు (పరారీ)
A8) అశోక్ ( ఆశ) తండ్రి గిరిజాజి, వయస్సు: 24 సం. కులం: కుర్మా, నివాసము: కే ఆర్ కే. కాలనీ (అరెస్ట్)ఇతను గతం లో మావల పోలీస్ స్టేషన్ లో ఒక హత్య యత్నం కేసు లో జైలు కి వెళ్ళినాడు మరియు వివిధ పోలీస్ స్టేషన్ల లో దొంగతనం కేసులలో జైలు కి వెళ్ళినాడు
A9) మినుగు రాజేశ్వర్ (రాజేష్) తండ్రి లింగన్న, వయస్సు: 24 సం, కులము: ఎస్సీ మాల అరెస్ట్.
09 మంది పై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 254/2024, u/sec 331(4),305 R/w 62 BNS తో కేసు నమోదు చేయబడిందని తెలిపారు. ఈ నిందితులందరూ వివిధ జిల్లాల్లో పలు దొంగతనాలు నిర్వహించినట్టు కేసులు నమోదు చేసి ఉన్నట్లు తెలియజేశారు
. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని, మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వివరాలను తెలియజేస్తూ ఈ చోరీకి కీలకంగా వ్యవహరించిన చౌహన్ రవి ప్రస్తుతం జైల్లో ఉన్నాడని ఇతను ఆదిలాబాద్ పట్టణంలో పలు కేసులలో నిందితుడుగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు అదే విధంగా A2 సన్నీ మరియు A4 గోవిందుడు కార్తీక్ పలు కేసులను అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు తెలిపారు. దొంగతనం చేసిన పద్ధతిని వివరిస్తూ వీరందరూ దొంగతనానికి అందజ ఒక 10 రోజుల ముందు హై వే పై గల ఒక ఢాబా లో రామాయి గ్రామం లో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో దొంగతనానికి పథకం వేశారు. ఇట్టి దొంగతనానికి చౌహాన్ రవి కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడని తెలిపారు. వీరు డిసెంబర్ 12వ తారీఖున రామాయి గ్రామం కు వీరందరూ బైకులపై చేరుకొని అర్ధరాత్రి వరకు వేచి ఉండి ఒకరితర్వాత ఒకరు ఆలా అందరు కలిసి గోడకు కన్నంవేసీ ముందుగాసన్నీ బ్యాంకు లోపలికి వెళ్లి బీరువాలను తెరవడానికి అట్టి కన్నం లో నుండి లోపడింది వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు బ్యాంకు లో ముందుగానే ఏర్పరిచిన హ్యూమన్ డిటెక్షన్ అలారం మోగినందున వీరందరూ అక్కడి నుండి పరారయ్యారని తెలిపారు. ఆ రోజు నుండి ఇప్పటివరకు ప్రత్యేక బృందం దొంగలకై అన్వేషిస్తూ ఉండగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారని వారు వివరాలను వెల్లడించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సీసీఎస్. సీఐ చంద్ర శేఖర్,రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై ముజాహిద్మరియు సీసీఎస్. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ఎస్పీ అదేశాను సారము డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఆధ్వర్యములో చాక చక్యముగా దొంగలను పట్టుకోన్న సీసీఎస్ సీఐ చంద్ర శేఖర్, రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై ముజాహిద్ మరియు సి సిఎస్ఆ దిలాబాద్ రూరల్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినంధించారు .
Comments